Site icon HashtagU Telugu

Skill Development Scam : చంద్రబాబుకు పదేళ్ల జైళ్ల శిక్ష పడొచ్చు..? – ఏపీ CID చీఫ్ సంజయ్

Skill Development Scam

10 Years or Life imprisonment for Chandrababu

స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ స్కాం (Skill Development Scam )లో మాజీ సీఎం చంద్రబాబు ను శనివారం ఉదయం CID అధికారులు నంద్యాల లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ స్కాంలో అరెస్ట్ చేస్తున్నామని తెలుపుతూ అదుపులోకి తీసుకున్న అధికారులు..మిగతా వివరాలేవీ కూడా తెలియజేయలేదు. కొద్దీ సేపటి క్రితం విజయవాడ డీజీపీ కార్యాలయంలో సీఐడీ అదనపు డీజీ ఎన్ సంజయ్ చంద్రబాబు అరెస్ట్ కు సంబదించిన వివరాలు.. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ స్కాం లో చంద్రబాబు పాత్ర తో పాటు మిగతా వారి వివరాలను మీడియా కు తెలియజేసారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో రూ. 550 కోట్ల స్కామ్ జరిగినట్లు ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌ (AP CID Chief Sanjay) తెలిపారు. ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడు చంద్రబాబు గా తేల్చారు. ఈ స్కామ్ వల్ల ప్రభుత్వానికి రూ. 371 కోట్ల నష్టం జరిగినట్లు వివరించారు. ఈ స్కామ్ కు సంబంధించి చంద్రబాబుకు అన్ని లావాదేవీల గురించి తెలుసనీ, నకిలీ ఇన్‌వాయిస్‌లతో షెల్‌ కంపెనీలకు నిధులు మళ్లించినట్లు తెలిపారు. ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇవ్వడం, ఎంవోయూ కుదుర్చుకోవడం ద్వారా ఈ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. ఈ స్కామ్ లో ముఖ్యమైన పత్రాల మాయం వెనుక చంద్రబాబు హస్తం ఉందని సంజయ్ అన్నారు.

ఈ స్కాం (Skill Development Scam) పూర్తి వివరాలు బయటికి రావాలంటే చంద్రబాబు (Chandrababu) కస్టోడియల్ విచారణ అవసరమని భావించినట్లు సీఐడీ ఛీఫ్ సంజయ్ తెలిపారు. ఈడీ, జీఎస్టీ అధికారులు ఇప్పటికే ఈ స్కాంపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ స్కాంలో తమకు లభించిన ఆధారాల్ని సంబంధిత కోర్టు ముందుంచుతామన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా సాక్ష్యుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబును అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆధారాలను ట్యాంపర్ చేసే ప్రమాదం కూడా ఉందని అరెస్టు చేయాల్సి వచ్చిందన్నారు.

చంద్రబాబు కేబినెట్ ఆమోదం లేకుండా ఏపీఎస్ఎస్డీసీ పేరుతో కార్పోరేషన్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్దమన్నారు. ఇది కేవలం స్కాం కోసమే ఏర్పాటు చేసారన్నారు.ఈ కార్పోరేషన్ ఛైర్మన్ తో పాటు గంటా సుబ్బారావును నాలుగు పదవుల్లో ప్రభుత్వం నియమించడం కూడా చట్ట విరుద్ధమన్నారు. స్కిల్ కార్పోరేషన్ తో సీమెన్స్ ఒప్పందం కుదిర్చిన డిజైన్ టెక్ కు సంబంధించిన జీవీఎస్ భాస్కర్ అనే వ్యక్తి, ఆయన భార్య ఐఏఎస్ అపర్ణ కార్పోరేషన్ డిప్యూటీ సీఈవోగా కూడా నియమించారన్నారు. రూ.2500 కోట్లకు పైగా పెట్టుబడుులు సీమెన్స్ కంపెనీ ద్వారా వస్తున్నాయని అసెంబ్లీలో అప్పట్లో ప్రకటించిన చంద్రబాబు.. అధికారికంగా మాత్రం 90 శాతం పెట్టుబడి ఎందుకు రాలేదని అడగలేదన్నారు.

దర్యాప్తులో మరిన్ని వివరాలు బయటకు వస్తాయని సంజయ్ తెలిపారు. ఈ స్కామ్ లో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను కూడా విచారించాల్సి వస్తుందని తెలిపారు. నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా షెల్‌ కంపెనీకి నిధులు మళ్లించారు. ప్రభుత్వానికి రూ.371 కోట్లు నష్టం వచ్చింది. హవాలా రూపంలో నిధులను దారి మళ్లించారు. ఇవన్నీ కూడా వికాస్ అనే వ్యక్తి ద్వారా చేతులు మారాయి. నిధుల దారి మళ్లింపునకు సంబంధించి చంద్రబాబును ప్రశ్నించాల్సి ఉంది. చంద్రబాబును కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ చేయాల్సిందే. న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకునే అరెస్ట్‌ చేశాం , ఆర్ధిక కుట్రకు పదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు అని సంజయ్ అన్నారు.

Also Read:  Chandrababu: 45 ఏళ్లుగా తెలుగు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశాను: చంద్రబాబు