Site icon HashtagU Telugu

Sidharth Luthra Tweet : ‘కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది’ అంటూ సిద్ధార్థ్ లూథ్రా ట్వీట్‌..

Sidharth Luthra Tweet:

Sidharth Luthra Latest Tweet

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం (Skill Development Case)లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Arrest) ను సీఐడీ (CID)..అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా (Lawyer Sidharth Luthra) వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటీకే CBI కోర్ట్ లో చంద్రబాబు ను ఎలాగైనా బయటకు తీసుకరావాలని ఎంతగానో కష్టపడుతున్నాడు. కానీ కోర్ట్ మాత్రం సిద్ధార్థ్ లూత్రా వాదనలకు సంతృప్తి చెందడం లేదు. జైల్లో చంద్రబాబు కు ప్రాణ హాని ఉందని..ఆయన్ను హౌస్ రిమాండ్ కు తరలించాలని చూసినాగాని కుదరలేదు. దీంతో టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. చంద్రబాబు జైలుకు వెళ్లి రెండు రోజులు కావొస్తుంది..ఇంకా బయటకు రాలేదు..ఓ పక్క ప్రాణ హాని ఉందంటున్నారు..ఏంజరుగుతుందో మా బాబు కు అంటూ చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యలు చేసుకుంటూ , గుండెపోటులకు గురవుతున్నారు.

సోషల్ మీడియా లో సైతం యువత , నెటిజనులు పెద్ద ఎత్తున సిద్ధార్థ్ లూత్రా కు ట్వీట్స్ చేస్తున్నారు. మా బాబు ను మీ చేతిలో పెట్టాం..ఏదోకటి చేసి కేసు లేకుండా చెయ్యండి..లేదంటే బెయిల్ ఫై ఐన బయటకు తీసుక రండి..మా భారం అంత మీ పైనే మోపం సర్..అంటూ సిద్ధార్థ్ లూత్రా ను వేడుకుంటున్నారు. సిద్ధార్థ్ లూత్రా సైతం చంద్రబాబు ను తప్పకుండ బయటకు తీసుకవస్తానని..ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లో నిలబడదని చెపుతూ భరోసా ఇస్తున్నారు.

ఇదే క్రమంలో ట్విట్టర్ లో ఆసక్తికర ట్వీట్ చేసారు. ‘అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేదు అని తెలిసినప్పుడు.. కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది’ అని గురు గోవింద్ సింగ్ వ్యాఖ్యలను ట్విటర్‌లో షేర్‌ చేశారు.. ‘ఈరోజు ఇదే మా నినాదం’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ట్వీట్ శ్రేణుల్లో ఉత్సహం..భరోసా ఇస్తుంది. దీంతో మీరే గెలుస్తారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. మరికొందరు నెగిటివ్‌ కామెంట్లు వేస్తున్నారు. మరోపక్క మరికాసేపట్లో రాజమండ్రి జైల్లో చంద్రబాబు ను సిద్దార్థ్ కలవబోతున్నారు.

Read Also : Rajinikanth: నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు: సూపర్ స్టార్ రజనీకాంత్

ఇక చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను ఉన్నత న్యాయస్థానం వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఇరువైపుల వాదనలు వినాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.