Site icon HashtagU Telugu

Jagan : ‘రాప్తాడు అడుగుతోంది జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని..?’ – జగన్ సమాదానికి సిద్ధమా..?

Babu Jagan Jaki

Babu Jagan Jaki

అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ ‘సిద్ధం’ (Siddham )సభ నిర్వహిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ పార్టీ కార్యకర్తలకు సీఎం జగన్ (Jagan) దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఈ సభలో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు (Chandrababu) సోషల్ మీడియా వేదికగా జగన్ కు ప్రశ్నలు సంధించారు. ‘రాప్తాడు అడుగుతోంది జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని? అనంత అడుగుతోంది కియా అనుబంధ పరిశ్రమలు ఏమయ్యాయని? సీమ రైతన్న అడుగుతున్నాడు నాటి డ్రిప్ పథకాలు ఎక్కడని? సమాధానం చెప్పి సభ పెడతావా? సభలో సమాధానం చెప్తావా?’ అని జగన్ ను ట్యాగ్ చేస్తూ చంద్రబాబు ట్వీట్ చేసాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ అధినేత, సీఎం జగన్ తన దూకుడు పెంచుతున్నారు. ఓ పక్క అభ్యర్థుల ఎంపిక ఫై కసరత్తులు చేస్తూనే..మరోపక్క ప్రచారం ఫై ఫోకస్ పెట్టారు. గత కొద్దీ రోజులుగా సిద్ధం పేరుతో వరుస సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఐదేళ్ల లో తమ ప్రభుత్వం చేసిన పనులు , సంక్షేమ పథకాలను వివరిస్తూ..ప్రతిపక్ష పార్టీల ఫై విరుచుకుపడుతున్నారు.

ఈ క్రమంలో ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ ‘సిద్ధం’ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు రాయలసీమ జిల్లాల నుంచి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. 250 ఎకరాల మైదానంలో సభ కోసం ఏర్పాట్లు చేసినట్లు స్థానిక నేతలు తెలిపారు. ఈ సభ కారణంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు.

Read Also : Athamma’s Kitchen : ఫుడ్ బిజినెస్ లోకి ఉపాసన..’అత్తమ్మ ‘ పేరుతో ప్రారంభం