Site icon HashtagU Telugu

Pawan Rings : పవన్ చేతికి ఉన్న ఆ ఉంగరాలు గమనించారా..? వాటి ప్రత్యేకత ఏంటో తెలుసా..?

Pawan Rings

Pawan Rings

ప్రకృతి వరమించిన ఈ మానవ సృష్టిలో ప్రతి ఒక్కరు ఎన్నో కలలు కంటాడు..ఎన్నో కోర్కెలు కోరుకుంటాడు. ఈ జీవితంలో అవన్నీ లభించాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తాడు. అలాగే ఆ కోర్కెలు తీరాలని చెప్పి..పలు పూజలు , యాగాలు చేస్తారు. అలాగే కొన్ని కలిసొచ్చే వస్తువులను కూడా తమ వెంట ఉంచుకుంటారు. ఇది చాలామంది చేస్తుంటారు. ముఖ్యంగా రాజకీయ నేతలైతే ఎక్కువ. ఉదాహరణకు మన తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) ని తీసుకోండి. ఆయన ఏపని చేసిన దానికి కలిసొచ్చే తేదీలను , గ్రహాలను చూసుకొని చేస్తారు. అందుకే ఆయనకు తిరుగులేని నేత అయ్యాడు.

తాజాగా ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం అలాగే చూస్తున్నాడట. చిత్రసీమలో పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజుకు రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే నటుడు ఆయన. అలాంటి ఆయన..ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చి..ఏపీని బాగుచేయాలని భావిస్తున్నాడు. వందల కోట్లు వచ్చే ఆదాయాన్ని సైతం పక్కకు పెట్టి ప్రజలకోసం రాత్రిబవళ్లు కష్టపడుతున్నాడు. రాజకీయాల్లోకి రానప్పుడు పల్లెత్తు మాట అనిపించుకుని పవన్..ఈరోజు ప్రజల కోసం తన కాలిగోడికి కూడా సరిపోని వారితో మాటలు అనిపించుకుంటున్నాడు. ఇదంతా కూడా ప్రజల కోసమే.

మనం ఏంకావాలనుకున్న..మన కోర్కెలు తీరాలని మన కష్టం తో పాటు దేవుడి అనుగ్రహం కూడా కావాలి. అందుకే పవన్ తన చేతికి రెండు ఉంగరాలు ధరించడం మొదలుపెట్టారు. తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును బాలకృష్ణ, ఆయన అల్లుడు నారా లోకేష్ తో కలిసి ములాఖత్ అయ్యాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జనసేన – టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నాయి అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు.

ఆ సమయంలో పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ మీద ఎంత మంది దృష్టి ఉందో, అదే సమయంలో ఆయన చేతికి ఉన్న ఉంగరాల మీద అనేక మంది దృష్టి పెట్టారు. పవన్ చేతికి (Pawan Rings) తాబేలు, నాగ అంగుళీకాలు(ఉంగరాలు ) ఉన్నాయి. అదే విధంగా పవన్ చేతికి పగడం ఉంగరం కూడా ఉంటుంది. దానిని ప్రతి మంగళ లేదా శని వారాల్లో దరిస్తాడట. దీనితో అసలు ఆ ఉంగరాలు ఎందుకు..? వాటిని పవన్ కళ్యాణ్ ఎందుకు ధరిస్తున్నారు అనే సందేహాలు మొదలయ్యాయి.

Read Also : Tollywood : రెండో పెళ్లికి సిద్దమైన నాగ చైతన్య..అమ్మాయి ఆమెనేనా..?

కూర్మ (తాబేలు ) ఉంగరం ధరిస్తే అది అధికార యోగం తో పాటుగా ధన యోగం కూడా లభించేలా చేస్తుందనేది నమ్మకం. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ కావాలనే కోరిక తో ఆ ఉంగరం ధరించి ఉండవచ్చు. ఇక నాగ ఉంగరం రాహు, కేతు దోషాలతో పాటుగా అమృత్యు అపాయాలను తొలగిస్తుందని పండితులు చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో కరెంట్ షాక్ మరికొన్ని అపాయాలను పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నాడు. అందుకే పండితుల సలహా మేరకు వాటిని ధరించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటనే కాకుండా ఆయన పెట్టుకున్న ఉంగరాలు సైతం ఆయన్ను వార్తల్లో నిలిచేలా చేస్తున్నాయి.