ఏపీ మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) చేయడం ఫై రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలుపుతున్నారు. ప్రస్తుతం లండన్ పర్యటన లో ఉన్న ఏపీ సీఎం జగన్ కు నిరసన సెగ ఎదురైంది. లండన్ లో ఉన్న NRI లు జగన్ బస చేసిన హోటల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. హోటల్ లోపలికి వెళ్లేందుకు ట్రై చేయగా..అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు.
మరోపక్క చంద్రబాబు అరెస్ట్ కు నిరసన గా రేపు ఏపీ (AP) వ్యాప్తంగా సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (Atchannaidu) పిలుపునిచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్, పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు నిరసనగా రేపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక చంద్రబాబు అరెస్ట్ ను యావత్ ప్రజానీకం తప్పుబడుతుంది. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల నేతలు , కార్యకర్తలు చంద్రబాబు కు మద్దతు పలుకుతున్నారు.
Read Also : Chandrababu Arrest: చంద్రబాబు కోసం పవన్ .. అనుమతి నిరాకరణ
సినీ, రాజకీయ ప్రముఖులు, పలు రంగాల ప్రముఖులు.. పలు పార్టీల పెద్దలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన అరెస్ట్ అక్రమమని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు, టీడీపీ శ్రేణులు.. సోషల్ మీడియాలో ఏపీ ప్రభుత్వం (AP Govt) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు సిట్ ఆఫీస్ లో ఉండగా..కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా వెళ్లి ఆయన్ను కలుస్తున్నారు. కొద్దీ సేపటి క్రితం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చంద్రబాబు ను కలిసొచ్చారు.
ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ..”జగన్ 16 నెలలు జైల్లో ఉండటం వలన కక్ష సాధింపు చర్యలతో చంద్రబాబు (Chandrababu) 10 నిమిషాలు అయినా సరే జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో అక్రమ కేసులో పెట్టి అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు ఏర్పాటు చేసి చాలామంది నిరుద్యోగ యువతకు శిక్షణను కల్పించారు. మూడు రాజధానులను మూడు సంవత్సరాల కాలాన్ని కాలయాపన చేసి గడిపేశారు. నవరత్నాలు పేరిట రూ. 80 వేల కోట్లు అప్పులు చేశారు. ఎవరు తీరుస్తారు ఆ బకాయిలు. వనరులు ఎలా ఉత్పత్తి చేయాలో సీఎంకి తెలియదు. అభివృద్ధి అనేది మన రాష్ట్రంలో ఎక్కడ ఉంది. గుంతలు తప్ప అభివృద్ధి శూన్యం. ఒక్క రోడ్డైనా ఎప్పుడైనా వేసిన దాఖలాలు లేవు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై పార్టీయే కాదు ప్రజలు కూడా ఉద్యమిస్తారు.” అని బాలకృష్ణ హెచ్చరించారు.
Read Also : Errabelli Dayakar Rao: పరిపాలనా సౌలభ్యం కోసమే పునర్ వ్యవస్థీకరణ: మంత్రి ఎర్రబెల్లి