Site icon HashtagU Telugu

Pawan Kalyan @ Instagram : ఇంస్టాగ్రామ్ లో పవర్ స్టార్.. నిమిషాల్లోనే లక్షల ఫాలోయర్లు

Power Star On Instagram.. Lakhs Of Followers Within Minutes

Power Star On Instagram.. Lakhs Of Followers Within Minutes

Pawan Kalyan @ Instagram : జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తొలిగా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచారు. ఇప్పటి వరకూ ఆయనకు ట్విట్టర్‌ ఖాతా మాత్రమే ఉంది. పార్టీ కార్యకలాపాల అప్‌డేట్‌ కోసం జనసేన పార్టీ పేరుతో మరో ట్విట్టర్‌ హ్యాండిల్‌ ఉంది. ప్రస్తుతం ట్విట్టర్‌ వేదికగా అభిమానులకు అందుబాటు ఉన్న ఆయన ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కూడా ప్రజలకు, అభిమానులకు అందుబాటులో ఉండబోతున్నారు.

ఇన్‌స్టాలోకి పవన్‌ (Pawan Kalyan) ఎంట్రీ ఇస్తున్నారు అనే వార్త సోమవారం రాత్రి నుంచీ సోషల్‌ మీడియాను ఓ రేంజ్ లో షేక్‌ చేస్తోంది. ఇప్పటికే పవన్‌ పేరుతో ఉన్న ఖాతాలకు లక్షల్లో ఫాలోయర్లు ఉన్నారు. మరి ఆయనే ఖాతా తెరిస్తే ఇంకేలా ఉంటుందో అన్న చర్చ భారీగా జరుగుతోంది. అయితే పవన్‌ కల్యాణ్‌ మంగళవారం ఇన్‌స్టా ఖాతాను తెరిచారు.

ఎలుగెత్తు.. ఎదురించు.. ఎన్నుకో.. జైహింద్‌ అంటూ తెరిచిన ఇన్‌స్టా ఖాతాలో ఇంకా ఆయన ఎలాంటి పోస్ట్‌ చేయలేదు. ప్రొఫైల్‌ ఫొటోగా ఆయన ఫొటో పోస్ట్‌ చేశారు. ఆయన ఖాతా తెరిచిన తక్కువ సమయంలో అంటే మంగళవారం ఉదయం 11.30 నిమిషాల సమయంలో 3.26.000 ఫాలో కాగా, 12.20 నిమిషాలకు ఆ సంఖ్య 4.97.000కు చేరుకోగా, మరో రెండు నిమిషాలకే అంటే 12.22 నిమిషాలకు ఆ సంఖ్య 5.10.000లకు చేరుకుంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌ పవన్‌ను ఫాలో అయ్యే సంఖ్యతో షేక్‌ అవుతోంది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన మొదటి పోస్ట్‌ ఏం ఉంటుందా? అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read:  Narendra Modi Virtual Inauguration : యావత్ ప్రపంచానికి ప్రేమను పంచిన మహనీయులు సత్యసాయి బాబా