AP : సర్పంచ్‌లు నిధుల కోసం రోడ్లపైకి రావాల్సిన దుస్థితికి జగన్ తీసుకొచ్చాడు – పవన్

నసేన అధికారంలోకి వస్తే సర్పంచ్‌లకు అధికారాలు ఇస్తాం అని హామీ

  • Written By:
  • Updated On - August 5, 2023 / 08:00 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి వైసీపీ ప్రభుత్వ తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. సర్పంచ్‌లు కష్టపడి ఎన్నికల్లో విజయం సాధిస్తే వారికి హక్కులు లేకుండా చేశారని..ఆఖరికి సర్పంచ్ లు నిధుల కోసం రోడ్లపైకి రావాల్సిన దుస్థితికి జగన్ తీసుకొచ్చారన్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన దృష్టినంతా రాజకీయాల ఫై పెట్టారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు మరింత దగ్గరవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే వారాహి యాత్ర తో జనసేన శ్రేణుల్లో ఉత్సహం నింపిన పవన్..ఇప్పుడు మూడో విడత వారాహి యాత్రకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో ఆయన మంగళగిరికి షిఫ్ట్ అయ్యారు. రెండు రోజులుగా వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. నిన్న శుక్రవారం పార్టీ నేతలతో మాట్లాడి..ఎన్నికల్లో ఎలా యాక్టివ్ గా ఉండాలి..ప్రజల వద్దకు నేతలు తరుచు వెళ్లాలని ..తన సినిమాల గురించి పట్టించుకోవద్దని తెలియజేసారు.అలాగే పలు విషయాల గురించి వారికీ వివరణ ఇచ్చారు. ఈరోజు పార్టీ కార్యాలయంలో సర్పంచ్ లతో సమావేశం ఏర్పాటు చేసారు.

ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ..వైసీపీ (YCP) ప్రభుత్వం ఫై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పంచాయతీల నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, సర్పంచ్‌లు కష్టపడి ఎన్నికల్లో విజయం సాధిస్తే వారికి హక్కులు లేకుండా చేశారని , న్యాయం అడిగితే… కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. గ్రామీణ ప్రజలకు చెందిన డబ్బును దొచుకుంటున్నారు. గ్రామ పాలన కూడా సీఎం కార్యాలయం నుంచే జరగాలనుకోవడం సరికాదు. స్థానిక సంస్థలకు రాజ్యాంగపరంగా దక్కిన అధికారాలు లేకుండా చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఇంకా రాజు పాలనే సాగుతోంది. కేంద్రం ఇచ్చే నిధుల నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాలోకి రావాలి. గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధుల విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అన్నారు.

పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం చేసేలా జనసేన మ్యానిఫెస్టో‌ (Janasena Manifesto)లో పెడతామని పవన్ అన్నారు. అధికారం ఉంది కదా అని… పంచాయతీల డబ్బు దొంగతనం చేస్తున్నారని.. అటువంటి వారిని దొంగలు అనకుండా ఏమంటారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సర్పంచ్‌లకు ఎన్నికలు పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకుంటారా అని నిలదీశారు. అధికార మదంతో అడ్డగోలుగా పని చేయకూడదన్నారు. సర్పంచ్‌లు వలంటీర్ వ్యవస్థపై దృష్టి పెట్టలాని సూచించారు. మీకు మూడు వేలు…‌ వలంటీర్లకు ఐదువేలా అని ప్రశ్నించారు.

కేరళలో అమలు చేస్తోన్న పంచాయతీ రాజ్‌ వ్యవస్థపై అధ్యయనం చేయాలి. చెక్ పవర్‌ సర్పంచ్‌లకే ఉండాలి. వాలంటీరు వ్యవస్థ, గ్రామ సచివాలయం వ్యవస్థలు కాంప్లిమెంటరీ సంస్థలు. వాలంటీరు, సచివాలయం ఉద్యోగులు వైసీపీ కార్యకర్తలుగా మారిపోయారు. ఏకత్వం లేనప్పుడు మనం ఎంత చేసినా ప్రయోజనం ఉండదు. గ్రామాభివృద్ధి విషయంలో అందరిలో ఏకాభిప్రాయం రావాలి. జనసేన అధికారంలోకి వస్తే సర్పంచ్‌లకు అధికారాలు ఇస్తాం అని హామీ ఇచ్చారు.

Read Also: Hyderabad: నగరంలో గంజాయి ముఠా అరెస్ట్