Site icon HashtagU Telugu

Lagadapati Rajagopal : కరుడు గట్టిన సమైక్య వాది మళ్లీ రాజకీయాల్లోకి రీ ఏంటీ ఇవ్వబోతున్నారా..?

Lagadapati Rajagopal Re Ent

Lagadapati Rajagopal Re Ent

కరుడు గట్టిన సమైక్య వాది అనగానే అందరికి టక్కున గుర్తుకొచ్చే వ్యక్తి లగడపాటి రాజగోపాల్‌ (Lagadapati Rajagopal)..ఈయన్నే ఆంధ్రా ఆక్టోపస్‌గా కూడా పిలుస్తారు. అలాంటి లగడపాటి మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజ‌గోపాల్ రీ ఎంట్రీ కోసం అనుచ‌రుల స‌న్నాహక సమావేశం విజయవాడలో (Vijayawada) జరిగింది. 2014లో ఉమ్మడి రాష్ట్రం విడిపోవడానికి ముందు రాజగోపాల్‌ సమైక్యాంధ్ర ఉద్యమం (Samaikyandhra Movement)లో చురుగ్గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఉద్యమాన్ని ముందుండి నడిపించారు రాజగోపాల్. రాష్ట్రం విడిపోదని, విడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. రాష్ట్రం విడిపోవడంతో ఇచ్చిన మాటకు కట్టుబడి రాజకీయాల నుంచి నిష్క్రమించారు.

2019 ఎన్నికల సమయంలో ముందస్తు ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. అయితే ఫలితాలు వచ్చిన తరువాత ఆయన అంచనాలు తప్పా యి. దీంతో అప్పట్నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఆయన్ను ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దింపాలని అనుచరులు కోరుతున్నారు. త్వరలో పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. లగడపాటి ఏ పార్టీలో ఉన్నా అభ్యంతరం లేదని ఆయనతో పాటే తామంతా అని నేతలు పేర్కొన్నట్లు సమాచారం. మరి నిజంగా రాజగోపాల్ రాజకీయాల్లోకి వస్తారా (Lagadapati Rajagopal Re Entry in Politics )..? వస్తే ఏ పార్టీ లో చేరతారు..? అనేది చూడాలి.

Read Also : Sonia Gandhi Vs PM Modi : ప్రధానికి సోనియాగాంధీ ప్రశ్నాస్త్రాలు.. పార్లమెంట్ స్పెషల్ సెషన్ పై నిలదీత