మెగాస్టార్ చిరంజీవి ఫై రీసెంట్ గా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర పదజాలం వాడిన సంగతి తెలిసిందే. చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజులు (Waltair Veerayya 200 Days) పూర్తి చేసుకున్న నేపథ్యంలో మూవీ టీం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ లో చిరంజీవి (Chiranjeevi) మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు. సినిమాలపై పడకుండా అభివృద్ధిపై దృష్టిపెట్టాలని ఏపీ సర్కార్ కు సూచించారు. ‘‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేదవారికి కడుపు నిండే విషయంగానీ, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం.. వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి?” అని చిరంజీవి వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) .. ప్రభుత్వానికి ఇచ్చే ఉచిత సలహాలు సినీ పరిశ్రమలో ఉన్న పకోడి గాళ్లకి కూడా చెబితే బాగుంటుందన్నారు. దీంతో కొడాలి నాని ఫై రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుడివాడ లో పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి నాని దిష్టిబొమ్మను దగ్ధం చేసి..హెచ్చరించారు.
ఇదిలా ఉంటె ఈరోజు చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా గుడివాడలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని కేక్ కట్ చేశారు. చిరంజీవిని తాను విమర్శించినట్లు నిరూపించాలని కొడాలి నాని ఛాలెంజ్ విసిరారు. తాను శ్రీరామ అన్నా టీడీపీ, జనసేన పార్టీలకు బూతు మాటలుగా వినపడుతున్నాయని, తానేం మాట్లాడానో చిరంజీవికి, ఆయన అభిమానులకు తెలుసన్నారు. తామంతా క్లారిటీ గానే ఉన్నామని, రాజకీయంగా చిరంజీవిని విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసన్నారు. ఎవరి జోలికి వెళ్లని చిరంజీవి విమర్శించే సంస్కారహీనుడిని కానన్నారు. డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీ గాళ్లకు చిరంజీవి సలహాలు ఇవ్వాలని అన్నాను..ఈ వ్యాఖ్యలు చిరంజీవి గురించి మాట్లాడినట్లు ఎట్లా అవుతుందని కొడాలి నాని అన్నారు. జనసేన, టీడీపీ నేతలు అనవసరంగా నాపై విష ప్రచారం చేసారని నాని చెప్పుకొచ్చాడు.
Read Also : Chiranjeevi New Projects : మెగాస్టార్ బర్త్ డే సందర్బంగా..మెగా ప్రాజెక్ట్ ల ప్రకటన