జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మరిచిపోలేని రోజు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) నాయుడు పేర్కొన్నారు. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో ప్రజలు తీర్పు ద్వారా ఉన్మాద పాలనకు ముగింపు పలికారని, ప్రజాస్వామ్యాన్ని తిరిగి నెలకొల్పారని ఆయన తెలిపారు. నాటి విజయాన్ని స్మరించుకుంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సీఎం చంద్రబాబు భావోద్వేగానికి లోనై వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన మునుపటి ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారని, తాము ఇచ్చిన తీర్పు ప్రజల బలాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Karpuravalli : మీ ఇంటి సమీపంలో ఈ ఆకు ఉంటె ఏమాత్రం లైట్ తీసుకోకండి..ఎందుకంటే !!
ప్రజల ఆశయాలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ ధ్యేయంగా మూడుశాఖలపై దృష్టి పెట్టామని సీఎం చంద్రబాబు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలే తమ పాలనకు ప్రాణమని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక్కో రోజు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కష్టపడుతున్నామని వెల్లడించారు. కూటమి పునాది వేసిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు పాలనను సరైన దిశగా నడిపిస్తున్నామని, అభివృద్ధికి పట్టాలు వేసినప్పటికీ, ఇంకా చాలా పని మిగిలి ఉందని పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్లలో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చారు.
AP Results Day : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు ఇది: : సీఎం చంద్రబాబు
తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు పోరాడిన విధానం, వారి కృషి వల్లే కూటమికి ఘన విజయం దక్కిందని సీఎం అభినందించారు. ప్రజల విశ్వాసానికి తగిన విధంగా పాలనను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చివరగా “జై ఆంధ్రప్రదేశ్.. జై జై ఆంధ్రప్రదేశ్” అంటూ తన సందేశాన్ని ముగించారు. అలాగే యువత దగ్గర నుంచి మహిళల వరకు..రైతుల దగ్గర నుంచి కుల వృత్తిదారుల వరకు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల దగ్గర నుంచి 5 కోట్ల ప్రజల వరకూ..విధ్వంసకారుడు వద్దు, విజనరీ లీడర్ నేతృత్వంలో కూటమి పరిపాలన కావాలంటూ, జగన్ అనే వెన్నుపోటు దారుడిపై జనం తిరుగుబాటే ఈ ప్రజా తీర్పు దినం అంటూ టీడీపీ ట్వీట్ చేసింది.
జూన్ 4… #PrajaTeerpuDinam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు…
ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు…
అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు…
సైకో పాలనకు అంతం పలికి…..ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు…… pic.twitter.com/HLfJg1A3tb
— N Chandrababu Naidu (@ncbn) June 4, 2025