Jagan CPS : జ‌గ‌న్ కు ఆర్బీఐ బాస‌ట‌, ఉద్యోగుల‌కు OPS, CPS రెండూ లేన‌ట్టే!

పాత పెన్ష‌న్ అమ‌లు రాష్ట్రాలు సంక్షోభంలోకి వెళ‌తాయ‌ని ఆర్బీఐ చేసిన హెచ్చ‌రిక

  • Written By:
  • Publish Date - January 18, 2023 / 03:35 PM IST

పాత పెన్ష‌న్ విధానాన్ని అమ‌లు చేస్తే రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ‌తాయ‌ని ఆర్బీఐ చేసిన హెచ్చ‌రిక ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి(Jagan CPS) ఊర‌ట క‌లిగిస్తోంది. కొన్ని రాష్ట్రాలు పాత పెన్ష‌న్ విధానాన్ని తీసుకురావ‌డంపై తీవ్రంగా స్పందించింది. రాబోవు రోజుల్లో రాష్ట్రాలు ఆర్థికంగా చితిపోతాయ‌ని చెప్పింది. అందుకే, పాత పెన్ష‌న్ విధానం(OPS) అమ‌లు చేయ‌డానికి రాష్ట్రాలు నిరాక‌రించాల‌ని సూచించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ పాత పెన్షన్  విధానాన్ని అమలు చేసిన రాష్ట్రాలకు వార్నింగ్ ఇవ్వ‌డం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ (Jagan CPS) ఊప‌రిపీల్చుకుంటోంది.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఊర‌ట(Jagan CPS)

సమీప భవిష్యత్తులో నిధులు లేని రాష్ట్రాలుగా మిగిలిపోతాయ‌ని అంచ‌నా వేసింది. రాష్ట్రాలు ప్రస్తుత ఖర్చులను భవిష్యత్తుకు వాయిదా వేయలేవని చెబుతూ ఓపీఎస్అమ‌లు(OPS) వ‌ద్ద‌ని చెప్పింది. పాత పెన్ష‌న్ విధానం ద్వారా ఆర్థిక వనరులలో వార్షిక పొదుపు స్వల్పకాలికంగా ఉంటుంది. ప్రస్తుత ఖర్చులను భవిష్యత్తుకు వాయిదా వేయడం కార‌ణంగా రాబోయే సంవత్సరాల్లో రాష్ట్రాలు నిధుల కొర‌త‌ను ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంది. పెన్ష‌న్ బ‌కాయిలు పెరిగిపోయే ప్ర‌మాదం ఉంద‌ని రిజ‌ర్వు బ్యాంకు అప్ర‌మ‌త్తం చేసింది.

Also Read : AP PRC : ఉద్యోగుల అల్టిమేటం! జ‌గ‌న్ మార్క్ `సంక్రాంతి` సినిమా!

పాత పెన్షన్ పథకం ఏమిటి? పాత పెన్షన్ విధానంలో, రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు చివరిగా తీసుకున్న జీతంలో 50 శాతానికి సమానమైన పెన్షన్‌ను చెల్లించేది. హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్ మరియు రాజస్థాన్ ఈ పెన్షన్ విధానాన్ని ఉపయోగిస్తున్నాయి. పాత విధానం వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడింది. నేషనల్ పెన్షన్ స్కీమ్ 2004లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని కింద ఉద్యోగులు తమ జీతాల్లో 10 శాతం పెన్షన్ ఫండ్ కోసం చెల్లిస్తారు. యజమాన్యాలు సమాన మొత్తంలో డబ్బు చెల్లించాలి. ఉద్యోగులకు పింఛన్లు చెల్లించేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. సేకరించిన కార్పస్‌పై పెన్ష‌న్ ఆధారపడి ఉంటుంది.

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ పాత పెన్షన్ విధానం 

ఇది రాష్ట్రాల జిడిపికి మేలు చేస్తుందని, రాష్ట్రాలు అధిక మూలధన వ్యయాలపై దృష్టి సారించాలని ఆర్‌బిఐ పేర్కొంది. ఆర్థిక మందగమనం సమయంలో కూడా మూలధన వ్యయంపై ఖర్చు పెట్టేందుకు బఫర్ ఫండ్స్‌ను రూపొందించాలని పేర్కొంది. ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో రాష్ట్రాలు ఖర్చు చేయాలని సూచించింది. పాత పెన్షన్ విధానంలో, ద్రవ్యోల్బణం, డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)లో పెరుగుదలను ప్రేరేపించినప్పుడు పెన్షన్‌లు పెరుగుతాయని వివ‌రించింది. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ పాత పెన్షన్ (OPS) విధానం యొక్క ప్రయోజనాలను పొందుతూనే ఉంటుందని ఇటీవల ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది.

Also Read : Abandonment of ‘CPS’: జగన్ కు పంజాబ్ దెబ్బ

తాజాగా ఆర్బీఐ వార్నింగ్ ప్ర‌కారం ఏపీ ఉద్యోగులు చేస్తోన్న ఓపీఎస్ డిమాండ్ నెర‌వేర‌దు. సీపీఎస్ ను ర‌ద్దు చేస్తాన‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన హామీ ఇక శాశ్వ‌తంగా అట‌కెక్కిన‌ట్టే. సీపీఎస్, ఓపీఎస్ డిమాండ్ల‌కు మ‌ధ్యే మార్గంగా జీపీఎస్ తెస్తామ‌ని మంత్రివ‌ర్గం చెబుతున్న‌ప్ప‌టికీ అసాధ్య‌మ‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉద్యోగులు ఏమి చేస్తారు? అనేది పెద్ద ప్ర‌శ్న‌.

ప్ర‌స్తుతం పీఆర్సీని డిమాండ్  

ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌కీయ పార్టీల‌ను లోబ‌రుచుకుని జీతాల‌ను పెంచుకోవ‌డం ఉద్యోగుల‌కు అల‌వాటు. ప్ర‌స్తుతం పీఆర్సీని డిమాండ్ చేస్తున్నారు. కానీ, దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఛాయ‌లు క‌నిపిస్తోన్న స‌మ‌యంలో పీఆర్సీ అసాధ్యం. రాబోవు ఆర్థిక ప‌రిస్థితుల‌ను ఆర్బీఐ పూస‌గుచ్చిన‌ట్టు చెబుతోంది. అయిన‌ప్ప‌టికీ ఉద్యోగులు మాత్రం సీపీఎస్ లేదా ఓపీఎస్(OPS) తో పాటు పీఆర్సీకి డిమాండ్ చేయ‌డం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan CPS) ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌పెట్ట‌డ‌మే. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉద్యోగుల‌ను శాంత‌ప‌రిచేందుకు తాజాగా రాష్ట్రాల‌కు ఆర్బీఐ ఇచ్చిన వార్నింగ్ ఒక అస్త్రంగా ప‌నిచేస్తోంది.