తిరుమల (Tirumala ) శ్రీవారిని ప్రతి రోజు లక్షలమంది దర్శించుకొని తమ మొక్కలు తీర్చుకుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి..దేశాల నుండి కూడా ప్రతి రోజు వస్తుంటారు. ప్రపంచంలోనే తిరుమల క్షేత్రం ప్రత్యేకమైంది. అందుకే ప్రతి ఏడాది ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోవాలని సినీ , రాజకీయకీయ , బిజినెస్, క్రీడా ఇలా ప్రతి రంగం వారు అనుకుంటారు. తాజాగా తిరుమల క్షేత్రంలో గోల్డ్ మాన్ (Gold Man) ప్రత్యేక్షమై , అందర్నీ ఆశ్చర్యపరిచారు. మాములుగా మనం ఎటైనా వెళ్లాలంటే ఒంటి మీద నగలను ఇంట్లో దాచుకొని వెళ్తుంటాం..దారిలో ఎక్కడైనా మిస్ అయ్యితాయేమో అని , ఎవరైనా కొట్టేస్తారానో..ఇలా రకరకాల భయాలతో నగలు వేసుకొని బయటకు వెళ్లేందుకు ఇష్టపడరు. ముఖ్యంగా ఆలయాలకు వెళ్లే సమయంలో.
అలాంటిది రద్దీ గా ఉండే తిరుమల క్షేత్రానికి (Sri Venkateswara Swamy Temple) విజయవాడ నగరానికి చెందిన ఓ భక్తుడు బంగారు ఆభరణాలు, చైన్లు, బ్రేస్‌లెట్లు, ఉంగరాలతో శ్రీవారి దర్శనానికి వచ్చారు. భారీగా ఆభరణాలతో వచ్చిన ఇతన్ని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. తిరుమల కొండపై ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కొంత మంది తమ మొబైల్స్‌లో రికార్డ్ చేశారు. ఈయన సైతం ఏమాత్రం చిరాకు పడకుండా భక్తుల ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఇంత బంగారాన్ని చూసి భక్తులే కాదు అక్కడి వారు సైతం అవాక్ అయ్యారు. ఒంటి మీదనే ఇంత బంగారం ఉంటె..ఇంట్లో ఇంకెంత బంగారం ఉందొ..వీరి కుటుంబ సబ్యులకు ఇంత బంగారం ఉందొ..అసలు ఈయన ఏంచేస్థాడో..ఇంత సంపాదిస్తాడో అంటూ రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
Read Also : Amala Paul: పాల్.. పాల్.. అమలాపాల్.. బికినీ షో తో గ్లామర్ హద్దులు చేరిపేస్తున్న బ్యూటీ