Site icon HashtagU Telugu

Chandrababu : విశాఖలో వైసీపీ నేతలు భూకబ్జాలు చేశారు

Chandrababu (2)

Chandrababu (2)

ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలకు పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో ప్రధాన పార్టీలో ప్రచారంలో స్పీడ్‌ పెంచాయి. అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు ప్రచారం ముందున్నారు. నియోజకవర్గాల వారీగా ఆయన ప్రచారం సాగుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే నేడు రాజాంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొని మాట్లాడుతూ.. ఆయనను, ఆయన కుటుంబాన్ని వేధించారన్నారని మండిపడ్డా. తనపై చివరకు రాళ్లదాడికి కూడా దిగుతున్నారని వ్యాఖ్యానించారు చంద్రబాబు.

తాను అరెస్టయ్యాయనన్న బెంగతో 203 మంది రాష్ట్రంలో ప్రాణాలు వదిలిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ మరణించిన కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి ధైర్యం చెప్పారని చంద్రబాబు అన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న నేత పవన్ కల్యాణ్ అని, మోదీ మూడో సారి ప్రధాని అవుతారని, ముగ్గురం కలసి ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అంతేకాకుండా.. తాము విశాఖను వాణిజ్య రాజధాని చేస్తే.. వైసీపీ నేతలు గంజాయి, డ్రగ్స్ క్యాపిటల్గా చేశారని చంద్రబాబు విమర్శించారు. సీఎం జగన్‌కు వైజాగ్‌పై ప్రేమ లేదని, ఆయనకు ఆస్తుల మీదే ప్రేమ ఉందని ఆయన విమర్శించారు. ఈ ప్రాంతంలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనం చేస్తున్నారు. నేను విశాఖకు అదానీ డేటా సెంటర్, లులు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తెస్తే వైసీపీ నేతలు తరిమేశారని ఆయన ధ్వజమెత్తారు. వాళ్లు భూకబ్జాలు చేశారు అని ఆరోపించారు చంద్రబాబు.

సలహాదారుల పేరుతో YCP ప్రభుత్వం ప్రజా ధనం వృథా చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఆ డబ్బులతో ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చన్నారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను సీఎం నిర్లక్ష్యం చేశారని, నేనుంటే 2020లోనే భోగాపురం విమానాశ్రయం పూర్తయ్యేదన్నారు. మేం సేకరించిన భూముల యజమానుల మధ్య వైసీపీ నేతలు గొడవ పెట్టారని, గిరిజన వర్సిటీ విషయంలోనూ ఇలాగే చేశారు అని ఫైరయ్యారు.

మేము అధికారంలో వచ్చాక ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని నిరుద్యోగ యువతకు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఫ్యాన్‌ను ముక్కలుగా విరగ్గొట్టి.. సైకిల్‌ ఎక్కేయాలని తొలిసారి ఓటు వేసే యువతకు చంద్రబాబు సూచించారు.

Also Read : Sitaram ramula kalyanam : సీతారాముల కల్యాణం.. ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి నిరాకరణ