Site icon HashtagU Telugu

Chandrababu Case : ఏసీబీ కోర్ట్ లో ముగిసిన వాదనలు

arguments concluded in vijayawada Acb court

arguments concluded in vijayawada Acb court

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం (Skill Development Case) కేసు కు సంబదించిన వాదనలు ఏసీబీ కోర్ట్ లో ముగిసాయి. మరికొద్ది సేపట్లో తుది తీర్పు రానుంది. ఏసీబీ కోర్ట్ ఏ తీర్పు ఇస్తుందో అనే ఉత్కంఠ నెలకొని ఉంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసు లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Arrest) ను అరెస్ట్ చేసిన సీఐడీ (CID)..నేడు ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. ఉదయం నుండి వాదనలు కొనసాగాయి.

Read Also : Chandrababu Arrest : కార్యకర్తలు సైలెంట్ ..జనసేనాధినేత దూకుడు

ఏపీ సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పి.సుధాకర్ రెడ్డి టీమ్ వాదనలు వినిపించగా.., చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. ఉదయం మొదలైన వాదనలు..మధ్యాహ్నం భోజన విరామం ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ వాదనలు మొదలుపెట్టారు. 2:45 నిమిషాలకు వాదనలు ముగిసాయి. సుమారు గంటకుపైగా లూథ్రా తన వాదనలను బలంగా వాదించారు. ప్రభుత్వం, సీఐడీ అధికారులపై ఆయన సంధించిన ప్రశ్నలకు కోర్టు ప్రాంగణం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తుంది.

సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డులను అందించేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలి అంటూ సిద్దార్థ్ వాదనలు వినిపించారు. మరికాసేపట్లో ACB కోర్ట్ తీర్పు ఇవ్వనుంది. ప్రస్తుతం అయితే చంద్రబాబు కు బెయిల్ వస్తుందని అంటున్నారు.