Site icon HashtagU Telugu

AP : చంద్రబాబు వద్ద కూలి పనిచేస్తున్న ‘పవన్’ – పేర్ని నాని సెటైర్లు

AP Ex-Minister Perni Nani Satires On Pawan Kalyan

AP Ex-Minister Perni Nani Satires On Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై మరోసారి మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) సెటైర్లు వేశారు. సామాజికవర్గం ఓట్లను పొట్లం కట్టి బాబుకు అమ్మేయడమే పవన్ తెలుసు..నిలకడలేని పవన్ కు రాజకీయాలెందుకు..? చంద్రబాబు వద్ద పవన్ కళ్యాణ్ కూలి పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు..ఇలా పేర్ని నాని పవన్ ఫై విమర్శలు చేసారు.

ప్రస్తుతం ఏపీలో జనసేన vs వైసీపీ గా మారింది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి సారించారు. ఇప్పటికే హైదరాబాద్ ను వదిలి మంగళగిరి కి షిఫ్ట్ అయినా పవన్..వరుస పర్యటనలతో అధికార పార్టీ కి చెమటలు పట్టిస్తున్నాడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి రాష్ట్రం ఎంతగా వెనుక్కుపోయిందో..ఎన్ని కోట్ల అప్పు చేసిందో..ఎంత దోచుకుందో ఇలా అన్ని సాక్ష్యాలతో ప్రజల ముందు ఉంచుతున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు , ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.

తాజాగా మ‌చిలీప‌ట్నంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు (Chandrababu) వద్ద పవన్ కల్యాణ్ కిరాయి ఒప్పుకున్నాడు.. కూలి తీసుకుంటున్నాడు. కూలి తగ్గట్టుగా పనిచేయడమే పవన్‌కు తెలుసు తప్ప వాస్తవాలు, విచక్షణతో అతనికి పని లేదు. వైసీపీ ప్రభుత్వం మీద,సీఎం జగన్ మీద ఉద్ధేశపూర్వకంగా విషం చిమ్మడం, అసత్యాలు మాట్లాడటం తప్ప, ఆయన మాటల్లో వాస్తవాలు లేవు, పవన్ మాట్లాడే మాటలకు అర్థ‌మేమైనా ఉందా? సీఎం వైయ‌స్ జగన్ మీద పవన్‌కు విపరీతమైన ద్వేషం, కక్ష ఉంది. చంద్రబాబు దగ్గర ఒప్పుకున్న ప్యాకేజీ కోసం తప్పితే.. పవన్ మాటలకు విలువ ఎక్కడిది..? ఇకనైనా, విషం చిమ్మే కార్యక్రమాలు కట్టిపెట్టు అని నాని అన్నారు.

చంద్రబాబు కోసమే పనిచేస్తానని దమ్ముంటే షమ్‌షేర్‌గా చెప్పొచ్చు కదా పవన్ కల్యాణ్. తాడిచెట్టు ఎందుకెక్కావ్ అంటే దూడ గడ్డికోసం అన్నట్టుగా పవన్ మాటలు ఉన్నాయి. కొద్దిసేపు నేనే ముఖ్యమంత్రి అవుతానంటావ్.. మరి కొద్దిసేపు నేను ముఖ్యమంత్రిని ఎలా అవుతానని అంటావ్.. ఎన్ని సీట్లలో పోటీ చేస్తావ్..? అంటే అది మాత్రం నాకు తెలియదంటావు. ఇప్పటికైనా, ప్రజలకు నిజాయితీతో నిజాలు చెప్పు.. బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేస్తామని క్లియ‌ర్‌గా చెప్పు. తణుకులో నీ పార్టీ అభ్యర్థిని ప్రకటించావ్.. తెనాలిలో నాదెండ్ల మనోహర్ ను ప్రకటించావు. మరి మిగతా చోట్ల‌ ఎందుకు ప్రకటించవు.. 175 సీట్లలో పోటీ చేస్తున్నావా.. లేదా..? మీరు ఎంతమంది వచ్చినా మాకు లెక్కలేదు. కానీ, మేము అంతా ఒక్కటే అని చెప్పటానికి ఎందుకు భయపడుతున్నారు..? ఎందుకు ముసుగు వేసుకుంటున్నారు..? అని నాని ప్రశ్నించారు.

30 చోట్ల చంద్రబాబు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌ల‌ను పెట్టడు. ప‌వ‌నేమో అక్కడ అభ్యర్థులను ప్రకటిస్తాడు. ఆ నియోజకవర్గాలకు వెళ్లి, ప్రభుత్వంపైన, ముఖ్య‌మంత్రి, మంత్రుల‌పై విషం చిమ్ముతాడు.. ఇదే వారి స్కీమ్‌. పవన్ 25-30 సీట్ల కంటే ఎక్కువ చోట్ల పోటీచేయడని నాని చెప్పుకొచ్చారు.

Read Also : BRS Minister: తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం పెరగడంలో కేటీఆర్ ది కీలక పాత్ర