Site icon HashtagU Telugu

Jana Sena Symbol : జనసేనకు షాక్‌.. ఫ్రీ సింబల్‌ జాబితాలోకి గాజు గ్లాసు

Pawan Kalyan

Can't Ask For Cm Post In Alliance.. Pawan Kalyan's Indirect Signal

జనసేన పార్టీ తన గుర్తుగా ప్రచారం చేసుకున్న గాజు గ్లాసును..  కేంద్ర ఎన్నికల సంఘం  ఫ్రీ సింబల్‌ జాబితాలోకి చేర్చింది. దీంతో ఇప్పుడా గుర్తు(Jana Sena Symbol) తమకు దక్కుతుందో, లేదోనన్న ఆందోళన జనసేన పార్టీలో నెలకొంది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రాంతీయ రాజకీయ పార్టీల జాబితాను వాటి గుర్తులతో సహా ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసింది. దీనితో పాటు 193 ఉచిత చిహ్నాల జాబితాను కూడా రిలీజ్ చేసింది. ఇందులో గతంలో జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తు(Jana Sena Symbol) కూడా ఉంది. అయితే, ఈ గుర్తును ప్రత్యేకంగా తన పార్టీకి కేటాయించాలని, దాని అభ్యర్థులందరికీ ఉమ్మడి గుర్తుగా మార్చాలని పవన్ కళ్యాణ్ ఈసీకి విజ్ఞప్తి చేయాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే తుది నిర్ణయం మాత్రం ఈసీ విచక్షణపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

ALSO READ : TDP Janasena: బీజేపీలేని కూటమి దిశగా టీడీపీ, జనసేన

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. 

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం..  ఏదైనా రాజకీయ పార్టీ తన గుర్తును నిలుపుకోవాలంటే ఎన్నికల్లో నిర్ణీత ఓట్ల శాతాన్ని పొందాల్సి ఉంటుంది. జనసేన కొన్ని ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అతి తక్కువ స్థానాల్లోనే పోటీ చేయడం వంటి కారణాల వల్లే పార్టీ సింబల్‌ను కోల్పోవాల్సి వచ్చిందని ఈసీ స్పష్టం చేసింది. గతంలో ఏపీలోని బద్వేలు ఉప ఎన్నిక, తిరుపతి లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ గాజు గ్లాసు గుర్తును వేరే పార్టీ అభ్యర్థులకు ఈసీ కేటాయించింది.