Site icon HashtagU Telugu

Pakistani Wedding : పెళ్లి విందులో మటన్ ముక్క తెచ్చిన కొట్లాట..

Man Does Not Get Mutton Pieces In Biryani

Man Does Not Get Mutton Pieces In Biryani

పెళ్లి (Wedding )కి వెళ్తే ముక్కలేనిదే ముక్క (Mutton Pieces) దిగదని చాలామంది అంటారు..ఆలా పెళ్లి విందులో ముక్క వేయలేదంటే అంతే సంగతి..ముక్క వేస్తావా..వెయ్యవా అంటూ నానా రభస చేయడం..కొట్టుకోవడం..బాదుకోవడం..ప్లేట్లు విసిరేసుకోవడం..పెళ్లి మండపాన్ని కాస్త అస్తవేస్తాం చేయడం ఇలా చాల సంఘటనలను మనం సోషల్ మీడియాలో చూసాం..తాజాగా అలాంటి ఘటనే పాకిస్థాన్ (Pakistani ) లో చోటుచేసుకుంది. ఆ చిన్న మటన్ ముక్క ఆ పెళ్లిని ఆగమాగం చేసింది. ప్రస్తుతం దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారడం తో అంత దీనిగురించి మాట్లాడుకోవడం చేస్తున్నారు.

Read Also : Drunk Driving: రెచ్చిపోతున్న మందుబాబులు, ఒకే రోజు 59 మంది జైలుకు

ఓ పెద్ద హల్ లో పెళ్లి వేడుక చేస్తున్నారు..పెళ్లి తతంగం అయిపోయింది. భోజనాలకు కూర్చున్నారు. ఓ పరదాకు ఒక వైపు మహిళలు, మరోవైపు మగవారు కూర్చుని భోజనం చేస్తున్నారు. ఇంతలో కొంతమంది డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఒక వ్యక్తితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. మా బిర్యానిలో మటన్ ముక్క వెయ్యలేదు..ఎందుకు వెయ్యలేదు..చెప్పు అంటూ గొడవ స్టార్ట్ చేసి..ఆ గొడవ పెద్దగా మారింది. చివరకు కొట్లాట వరకు వచ్చింది. ప్లేట్స్ పడేయడం..భోజనాన్ని అటు ఇటు వేయడం..వద్దు అని చెప్పిన వారిపై సీరియస్ అవ్వడం ఇలా నానా రభస చేసారు. ఈ వీడియో చూసిన వారంతా చిన్న ముక్క కోసం ఎంత చేస్తారా..అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.