1971 యుద్ధంలో పాకిస్తాన్ ఆర్మీకి పట్టుబడిన 54 మంది జవాన్లు ఇంకా బతికే ఉన్నారని వారి కుటుంబ సభ్యులు నమ్ముతున్నారు. కొంతమందైతే వారి జాడను వెదుక్కుంటూ పాక్‌కు వెళ్లారు కూడా. కానీ అక్కడ వారికి నిరాశే ఎదురైంది. మరి.. యుద్ధ ఖైదీలుగా పాకిస్తాన్‌కు చిక్కిన ఆ 54 మంది సైనికులు ఏమయ్యారు?

పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆమిర్‌ అబ్దుల్లా ఖాన్‌ నాయిజీతో సహా 93 వేల మంది పాక్‌ సైనికులు భారత దళాల ఎదుట బేషరతుగా లొంగిపోవడంతో 13 రోజుల పాటు ఏకధాటిగా సాగిన యుద్ధం ముగిసింది. భారత్‌ విజయంతో బంగ్లాదేశ్‌ స్వతంత్ర దేశంగా అవతరించింది.

పాకిస్తాన్‌లో చెరలో ఉన్నట్టు భావిస్తున్న సైనికుల కుటుంబాల్లో నెలకొన్న చీకట్లు తొలగిపోలేదు. అశోక్‌ అనే సైనికుడు తాము పాకిస్తాన్‌లో చిక్కుకున్నామని చెప్తూ డిసెంబరు 26, 1974న భారత్‌లోని తన తండ్రి ఆర్‌ఎస్‌ సురికి రాసిన ఓ లేఖ మాత్రం వారి మనసుల్లో కాంతిరేఖలు ప్రసరింపజేసింది.

 1975 ఆగస్టులో.. ‘ప్రియమైన నాన్న.. ఆశీర్వాదం కోసం అశోక్‌ మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాడు. నేనిక్కడ బాగానే ఉన్నాను. ఇండియన్‌ ఆర్మీ, భారత ప్రభుత్వంతో మా గురించి మాట్లాడండి. మేమిక్కడ 20 మంది ఆఫీసర్లం ఉన్నాం. మాకు విముక్తి కల్పించేందుకు భారత ప్రభుత్వం పాకిస్తాన్‌ సర్కారును సంప్రదిస్తే బాగుంటుంది’అని లేఖలో పేర్కొన్నాడు

అప్పటి రక్షణ శాఖా కార్యదర్శి ఆ లేఖలో ఉన్న సంతకం అశోక్‌దేనని నిర్ధారించారు. మేజర్‌ ఏకే ఘోష్‌ పాకిస్తాన్‌తో యుద్ధంలో పాల్గొన్నట్టు ఆయన ఫొటోలు టైమ్‌ మ్యాగజీన్‌లో ప్రచురితమయ్యాయి. కానీ, యుద్ధానంతరం ఆయన మాత్రం ఇండియాకు తిరిగి రాలేదు. ఆయన మరణించి ఉండొచ్చనే అభిప్రాయాలు ఒకవైపు, పాక్‌లో పట్టుబడి ఉన్నారేమోననే వాదనలు మరోవైపు వినిపించాయి.

మోహన్‌లాల్‌ భాస్కర్‌ అనే సైనికుడు 1968- 1974 వరకు పాకిస్తాన్‌ జైలులో గడిపి డిసెంబరులో విడుదలయ్యారు. Indian Spy in Pakisthan పేరిట పుస్తకం రాశారు. పాకిస్తాన్‌ సెకండ్‌ పంజాబ్‌ రెజిమెంట్‌కు చెందిన కల్నల్‌ అసీఫ్‌ షఫీని తాను కలిసినట్టు అందులో పేర్కొన్నారు. అదేవిధంగా మేజర్‌ అయాజ్‌ అహ్మద్‌ సిప్రాను కలిశానని 1968-71 యుద్ధ సమయంలో దాదాపు 40 భారత సైనికులు జైళ్లలో మగ్గుతున్నట్టు ఆయన చెప్పినట్టు రాసుకొచ్చారు.

ఇక బేనజీర్‌ భుట్టో బయోగ్రఫీలో బ్రిటీష్‌ చరిత్రకారులు విక్టోరియస్‌ కఫిల్‌ తనకు పాకిస్తాన్‌లో భారత యుద్ధ ఖైదీలు ఉన్నట్టు ఆ దేశానికి చెందిన ఓ లాయర్‌ తనకు చెప్పారని పేర్కొన్నారు. అంతేకాక పాకిస్తాన్‌ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. భారత వింగ్‌ కమాండర్‌ హరిసేన్‌ గిల్‌ నడుపుతున్న యుద్ధ విమానం డిసెంబర్‌ 3న కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్‌ను ప్రాణాలతో పట్టుకున్నట్టు ఆర్మీ అధికార ప్రతినిధి చెప్పిన మాటలు రేడియో ప్రకటనలో వెలువడ్డాయి.

చందర్‌ సుతా డోగ్రా వంటి సీనియర్‌ జర్నలిస్టులు వీరి గురించి వివరాలు తెలుసుకునేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. రిటైర్డ్‌ ఆర్మీ అధికారులు, బ్యూరోక్రాట్లు, జవాన్ల బంధువులు, వారి దగ్గర ఉన్న ఉత్తరాలు, వార్తా పత్రికల క్లిప్పింగులు, డైరీలు, ఫొటోలు, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న వివరాల ఆధారంగా వారు ఏమైపోయారన్న ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు కృషి చేశారు. 

తన పరిశోధనలో భాగంగా.. పాకిస్తాన్‌ నిజంగానే ఈ 54 మందిని చంపేసిందా? వారు పాక్‌లోనే బంధీలుగా ఉన్నారని ఇండియా నిరూపించగలదా?