షిర్డీ సాయిబాబ భక్తులకు సాయి సంస్థాన్ గుడ్ న్యూస్ !!

ఇక‌పై భ‌క్తుల‌కు సాయి ఆమర సమాధిని స్పృశించే భాగ్యం క‌ల్పించిన ట్ర‌స్ట్‌.

వీఐపీల‌తో పాటు సామాన్య భ‌క్తుల‌కు ఈ అవ‌కాశం క‌ల్పించిన సంస్ధాన్‌.

సమాధి ముందున్న అద్దాలు, మెష్ తొలగించడంతో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకున్న ట్ర‌స్ట్‌.

సాయి ఆరతి జరుగుతున్నప్పుడు భక్తులు గురుస్థాన్ ఆలయానికి ప్రదక్షిణలు చేయవచ్చు.

భక్తుల రద్దీ ఎక్కువుగా ఉన్నప్పుడు మాత్రం తక్కువ ఎత్తులో ఉన్న అద్దాలు అమర్చడం, ద్వారకామాయి గుడిలోకి లోపలి నుంచి భక్తులను అనుమతించడం చేస్తారు.

గతంలో సాయిబాబా సమాధి ముందు గాజు అద్దాన్ని అడ్డుగా పెట్టడంతో భక్తులు సమాధిని తాకలేక అసంతృప్తితోనే బాబా దర్శనం చేసుకుని వెళ్లేవారు.

బాబా సమాధిని తాకాలనే ఆశతో వ‌చ్చే వారికి షిర్డీ సాయి సంస్థాన్ నిర్ణయం ఆనందం క‌లిగిస్తోంది.