30 ఏళ్ల తర్వాత ఆ ఊరికి బస్సు రావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆర్టీసీ డీఎం, డ్రైవర్, కండక్టర్‌ను శాలువాలతో సత్కరించారు. కరోనా నేపథ్యంలో నెన్నెల, మైలారం, కుశ్నపల్లి గ్రామాలకు ఏడాదిగా బస్సు నిలిచిపోయింది. ప్రజలు, విద్యార్థుల ఇబ్బందులు గమనించిన ప్రవాస భారతీయుడు వెంకట కృష్ణారెడ్డి అక్టోబర్ 21న ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. మరుసటి రోజు నుంచి ఆయా గ్రామాలకు బస్సు పునఃప్రారంభమైంది.