ఫిన్లాండ్కి చెందిన స్పినోవా టెక్నాలజీస్ అనే సంస్థ గోధుమ, బార్లీ, వరి లాంటి పంటల వ్యర్థాలతో- వాటి గడ్డి నుంచి- దారం తీసి వస్త్రాన్ని తయారుచేస్తోంది.
ఉప్పునీటితో వెలిగే ‘వాటర్‌లైట్’. వండర్‌మ్యాన్ థామ్సన్ కొలంబియా, ఇ-డినా సంస్థలు కలిసి దీన్ని తయారుచేశాయి. కేవలం అరలీటరు నీటితో 45 రోజులపాటు నిర్విరామంగా వెలుగుల్ని పంచుతుంది.
గాలి అక్కర్లేని, పంక్చర్ అవని టైర్ల తయారీ..అమెరికాకి చెందిన గుడ్ఇయర్ టైర్ల కంపెనీ తయారుచేసిన ఈ కొత్త టైర్లను టెస్లా కార్లతో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు
కనెక్టెడ్ హెల్త్ స్టేషన్..శరీర బరువుతో పాటు కండరాల పటుత్వమూ నాడీ వ్యవస్థ తీరుతెన్నులూ తెలిసిపోతాయి. ఏ భాగంలో ఎంత కొవ్వు ఉందో, గుండె రక్తనాళాలు ఎలా పనిచేస్తున్నాయో, వ్యాస్కులర్ ఏజ్ ఎంతో తెలుసుకోవచ్చు
కార్బన్‌డై ఆక్సైడ్‌ని సేకరించి వజ్రాలను తయారుచేయడం వల్ల ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు అటు గాలిలో కాలుష్యమూ తగ్గుతుంది,
న్యూయార్క్‌కి చెందిన ఎస్పర్ బయోనిక్స్ సంస్థ తయారుచేసిన ఈ ప్రోస్థటిక్ హ్యాండ్. కృత్రిమమేధ, క్లౌడ్ బేస్డ్ రోబోటిక్స్, ఎలక్ట్రోమయోగ్రఫీ ఆధారంగా పనిచేసే మెదడు-కంప్యూటర్ ఇంటర్ఫేస్(బీసీఐ)ల సాయంతో అచ్చం సహజమైన చెయ్యిలాగా పనిచేస్తుంది.
ఇంటి పైకప్పుకు వాడే పెంకులు, పలకలతో కలిసిపోయేలా సౌరఫలకాలను ప్రత్యేకంగా తయారుచేస్తారు. దాంతో ఎలాంటి ఇంటికైనా వేయదలచుకున్న పైకప్పుతో ఇవి కలిసిపోతాయి. వీటిమీద నీరూ దుమ్మూ ధూళీ నిలవవు కనుక శుభ్రం చేయాల్సిన పనీ ఉండదు. తయారైన కరెంటుని ఇంట్లో వినియోగించుకోవటానికి వైరింగ్ ఏర్పాటుచేయడం కూడా తేలిక.
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు..స్టికర్ లాంటి దాంతో అవన్నీ చర్మాన్ని అంటిపెట్టుకుని ఉండేలా చూస్తారు. గుండె, రక్తనాళాలు, కండరాల సమస్యలు, కడుపు, ఊపిరితిత్తులు... ఏ భాగాన్నయినా సరే నిరంతరం ఫొటోలు తీసి దానిని అనుసంధానించిన కంప్యూటర్‌కి పంపుతుంది.
‘ఎలక్ట్రానిక్ ఇంక్’ సాంకేతికతతో దీన్ని తయారుచేసింది జర్మనీ సంస్థ. ఫోనులోని ఆప్‌తో ఒక్క క్లిక్ చేస్తే చాలు- కారు బయటివైపు రంగంతా మారిపోతుంది. కావాలనుకుంటే రకరకాల ప్యాటర్న్స్‌లో కూడా రంగులు కనపడతాయి
అసుస్ కంపెనీ. ఈ సంస్థ తయారుచేసిన 17 అంగుళాల ‘జెన్‌బుక్ ఫోల్డ్ ఒఎల్ఇడి’ టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్‌ని మడతపెట్టి పన్నెండు అంగుళాల సైజుకి మార్చేయొచ్చు
పేరు- అమెకా. బ్రిటన్‌కి చెందిన ‘ఇంజినీర్డ్ ఆర్ట్స్’ అనే సంస్థ తయారుచేసింది. కృత్రిమమేధతో రూపొందించిన ఈ రోబో ప్రత్యేకత ఏమిటంటే- మనిషిలానే స్పందిస్తుంది, హావభావాలను ప్రకటిస్తుంది. నవ్వుతుంది, బాధపడుతుంది, ఆశ్చర్యాన్ని ప్రకటిస్తుంది,