రిలయన్స్ జియో తమ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. సరికొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. కేవలం రూ.1తో రీచార్జ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది.

ఒక రూపాయితో రీచార్జ్ చేసుకొని 30 రోజుల వ్యాలిడిటీతో 100MB డేటాను పొందవచ్చునని తెలిపింది. ఒకవేళ డేటా పరిమితి ముగిసిపోతే డేటా వేగం 64Kbpsకు తగ్గుతుంది.

ప్లాన్ రీచార్జ్‌లో మరో సౌకర్యం కూడా ఉంది. యూజర్స్‌కు 500 ఎంబీ డేటా కావాలంటే ఐదుసార్లు, 1 జీబీ డేటా కావాలంటే 10సార్లు రీచార్జ్ చేసుకోవచ్చు. అయితే గరిష్టంగా ఎన్నిసార్లు రీచార్జ్ చేయాలనే దానిపై స్పష్టత లేదు.

ఒక రూపాయి రీచార్జ్ కోసం యూజర్స్ మై జియో యాప్‌లో వ్యాల్యూ సెక్షన్‌ను ఓపెన్ చేస్తే, అందులో రూపాయి రీచార్జ్ ప్యాక్ కనిపిస్తుంది.  ఇప్పటికే ఉన్న 1GB డేటా ప్లాన్ వ్యాల్యూ రూ.15. కానీ రూ.1 ఆఫర్ ద్వారా 10సార్లు రీచార్జ్ చేసుకుంటే రూ.10 అవుతుంది. అప్పుడు 1GB డేటా వస్తుంది. అంటే రూ.5 ఆదా చేసినట్లు.

ఇటీవలే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సహా అన్ని టెల్కోలు సంస్థలు ప్రీపెయిడ ఛార్జీలను 20 శాతం నుండి 25 శాతం మేర పెంచాయి. గతవారం జియో రూ. 119 రీఛార్జ్ ప్లాన్‌ను సవరించింది. ఇందులో రోజువారీ 300 ఎస్సెమ్మెస్‌లతో పాటు, 1.5GB హైస్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ ఇస్తున్నట్లు తెలిపింది.