బ్లడ్ గ్లూకోజ్ స్థాయి, శరీరంలోని ఎనర్జీకి ప్రధాన కారణం, కానీ, బ్లడ్ గ్లూకోజ్ స్థాయి సాధారణ స్థాయిల కంటే తక్కువగా ఉన్నప్పుడు హైపోగ్లైసీమియా వస్తుంది.
డయాబెటిస్‌కి మందులను వాడుతువునట్లయితే, గ్లూకోమీటర్ ను ఉపయోగించి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను ఎల్లప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి.
హైపోగ్లైసీమియాని నిర్ధారించడానికి భోజనం ముందు అలాగే తర్వాత రక్తంలోని చక్కెర స్థాయిలను చెక్ చేస్తారు.
హైపోగ్లైసీమియా ప్రధాన సంకేతాలు – హార్ట్ బీట్ ఎక్కువ అవ్వడం, అలసట, వణుకు,పాలిపోయిన చర్మం, ఆందోళన
తీవ్ర లక్షణాలు: ఆహారం లేదా ద్రవ పదార్ధాలను తీసుకోలేకపోవడం, మూర్చ, స్పృహ లేకపోవుట,– బట్టలు తడిసిపోయేంత విపరీత చెమటలు పట్టడం