మినరల్స్, సాల్ట్స్ కలసి రాయి మాదిరిగా మూత్ర పిండాల్లో ఏర్పడేవే కిడ్నీ స్టోన్స్.

తక్కువ నీరు తాగే వారికి, ఉప్పు ఎక్కువ తీసుకునే వారికి రాళ్లు వచ్చే ప్రమాదం..!

 పొట్ట భాగంలో చాలా చురుకైన నొప్పి వస్తుంటే అది రాళ్లకు సంబంధించినదే

చిన్న రాళ్లు అయితే ఎలాంటి నొప్పి లేకుండా  బయటకు వెళ్లిపోతాయి. పెద్ద రాళ్లు అయితే అవి మధ్యలో ఇరుక్కుపోయి నొప్పికి కారణమవుతాయి..

ఒక పక్కకు లేదంటే వెనుక వైపునకు నొప్పి వస్తుంది. ఎంత వేగంగా వస్తుందో, అంతే వేగంగా నొప్పి తగ్గిపోతుంది.

స్థూలకాయం, జీవక్రియల సమస్యలు, మధుమేహం, ఆహారం, నీటి పరిమాణం కిడ్నీ రాళ్లకు కారణం

రాళ్ల పరిమాణం పెద్దగా ఉండి, మూత్ర విసర్జనకు ఆటంకంగా మారితే సర్జరీ ఒక్కటే పరిష్కారం.