50 ఏళ్ల త‌ర్వాత మీ లైఫ్‌ని ఇలా ప్లాన్ చేసుకోండి.. అద్భుత‌మైన టిప్స్‌

మీకు అప్పు ఇవ్వడానికి ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. వారి వలలో చిక్కుకోవద్దు. అవసరం లేని వస్తువులు కొనడానికి రుణాలు తీసుకోవద్దు. విలువ తగ్గే వస్తువులకూ ఇదే సూత్రం వర్తిస్తుంది.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, జీ-సెక్యూరిటీలు, ఇండెక్స్‌ ఫండ్లు/ఈటీఎఫ్‌లలో సిప్‌ ఇలా వైవిధ్యంగా మదుపు చేయండి. దీర్ఘకాలిక ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు షేర్లు ఇప్పటికీ మంచి మార్గమే.

యాజమాన్యం నుంచి అందేది కాకుండా కుటుంబం అంతటికీ వర్తించేలా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోండి. చాలామంది ఆర్థికంగా కొన్నేళ్లు వెనక్కి వెళ్లడానికి కుటుంబంలో ఒక వ్యక్తి అనారోగ్యం కారణం అయిన సందర్భాలున్నాయి.

మీపై ఆధారపడిన వారుంటే.. తప్పనిసరిగా తగిన మొత్తానికి టర్మ్‌ పాలసీ తీసుకోండి. అనుకోనిది ఏదైనా జరిగినప్పుడు పాలసీ నుంచి వచ్చిన డబ్బును ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో మదుపు చేసినా, కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చేలా ఉండాలి.

తొందరగా ఆర్థిక స్వాతంత్య్రం సాధించాలంటే రుణాలు తీసుకోవడం ఆపేయాలి.