అప్పులు  తీర్చ‌లేక‌పోతున్నారా..?  అయితే ఇలా చేయండి..

పేద, మధ్య తరగతి ప్రజలు తమ అప్పులు తీర్చడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.

కొన్ని సందర్భాల్లో ఊహించకుండా వచ్చే యాదృచ్ఛిక ఖర్చుల కోసం తప్పనిసరిగా అత్యవసర పొదుపు నిధిని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది.

అత్యవసర పొదుపు నిధి ఏర్పాటు చేసుకోకపోతే ఎంత సంపాదించినా ఆదాయం కన్పించదు. వడ్డీలు, అసలు చెల్లింపులతోనే సంపాదన ఖర్చు అయిపోతుంది.

ఎటువంటి ఆస్తులు లేక‌పోయినా  రుణం తీసుకునేవారికి ఆర్థిక బాధ్యతలు మాత్రమే ఉంటాయి.

కొంత‌మంది అనుకోకుండా వచ్చే ఖర్చుల కోసం అప్పులు చేస్తూ ఉంటారు. వాటిని తీర్చడం కోసం మరిన్ని రుణాలు చేయడాన్ని అలవాటు చేసుకుంటారు.

అందుకే ప్రతి వ్యక్తి తన సంపాదనలో కొంత తీసి అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత.. తమ రుణాలను చెల్లించాలి.

అప్పులు చెల్లించే సమయంలో ఏవైనా ఖర్చులు వస్తే రుణం వైపు వెళ్లకుండా.. అత్యవసర పొదుపు నిధిలో డబ్బులు తీసి ఖర్చు చేయాలి

ఇలా చేయడం ద్వారా ఇప్పటికే ఉన్న రుణాలు తీరిపోయిన తర్వాత అప్పులు లేకుండా రుణ రహితంగా మారి.. ప్రశాంత జీవనం గడపవచ్చంటున్నారు నిపుణులు.