ఈ ఐదు ఆహార పదార్థాలను ప్రతి రోజూ తీసుకోకూడదు..మనం తీసుకునే ఆహారమే అత్యంత ప్రభావం చూపించే ఔషధం

ఫ్లాట్ బీన్స్ ఆయుర్వేదం ప్రకారం ఫ్లాట్ బీన్స్ ఘనాహారం కిందకు వస్తుంది. దీన్ని రోజూ తీసుకుంటే వాత, పిత్త దోషాలు పెరుగుతాయి.

రెడ్ మీట్ పంది మాంసం, గొడ్డు మాంసం, గొర్రె మాంసం రెడ్ మీట్ కిందకే వస్తాయి. ఇవి ఘనాహారం. మలబద్ధకానికి కారణమవుతాయి.

ఎండించిన కూరగాయలు : కూరగాయలను ఎండించి, ఏడాది పొడవునా కొన్ని ప్రాంతాల్లో వాడుకునే వారున్నారు. కానీ, ఇవి జీర్ణానికి కష్టమవుతాయి.

పచ్చి ర్యాడిష్ ఔషధ గుణాలుండే ముల్లంగిని పచ్చిగా తీసుకోకూడదు. థైరాయిడ్ పనితీరు, పొటాషియం స్థాయులపై దీని ప్రభావం పడుతుంది.

పులిసిన ఆహార పదార్థాలు : పులిసిన ఆహారాలతో వేడి పెరుగుతుంది. పిత్త దోషం పెరుగుతుంది. రక్త సంబంధిత సమస్యలకు కారణమవుతాయి.