అంజీర్ ను నాన బెట్టుకుని తింటే ఎంత ఆరోగ్యమో తెలుసా !

బరువు తగ్గడానికి అంజీరా బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువ.  ఉదయాన్నే తినడం వల్ల ఎక్కువ సమయం పాటు ఆకలి తెలియదు.

పేగుల్లో చురుకుదనం : మేడి పండులో సొల్యూబుల్, ఇన్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. దీనివల్ల జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

మధుమేహానికీ : వీటిల్లో క్లోరోజెనిక్ యాసిడ్, పొటాషియం, ఒమెగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీంతో రక్తంలో గ్లూకోజ్ నియంత్రిత స్థాయిలో ఉంచడంలో వీటి పాత్ర ఎక్కువ.

గుండె ఆరోగ్యానికీ : అంజీరాని తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరాయిడ్స్ తగ్గుతాయి.చెడు కొలెస్ట్రాల్ పెరిగితే రక్త నాళాలు మూసుకుపోయి గుండె పోటు

ఎముకలు గట్టిదనానికి : మహిళలు, వృద్ధులు, చిన్నారులకు క్యాల్షియం అవసరం ఎక్కువగా ఉంటుంది. అంజీరాని రోజూ తినేవారికి క్యాల్షియం తగినంత అందుతుంది

గర్భిణులు : అంజీరాలో విటమిన్ బీ6, ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఎక్కువ..గర్భిణులు అంజీరాని తినడంవల్ల ముందస్తు గర్భస్రావాలు తగ్గుతాయి.

కేన్సర్ రిస్క్ : అంజీరాతో కేన్సర్ రిస్క్ తగ్గించుకోవచ్చు. బ్రెస్ట్, కొలన్ కేన్సర్ రిస్క్ ప్రధానంగా తగ్గుతుంది.