Site icon HashtagU Telugu

Lokesh Helps : చిన్నారి వీడియో చూసి చలించి పోయిన మంత్రి లోకేష్

Lokesh Helps

Lokesh Helps

సోషల్ మీడియా లో సరదా వీడియోలే కాదు కొన్ని సార్లు మనసును చలించేలా చేసే వీడియోలు కూడా దర్శనం ఇస్తుంటాయి. ఆ వీడియోలు మన మనసుకు ఎంతో బాధ , జాలిని కలిగిస్తాయి. అయ్యో అంటూ ఒక్కసారిగా మనలో మనమే బాధపడేలా చేస్తాయి. తాజాగా ఇప్పుడు సోషల్ మీడియా లో అలాంటి వీడియోనే వైరల్ అవుతుంది. రోడ్డుపై భిక్షాట‌న చేస్తున్న ఓ చిన్నారి నిద్ర మత్తులో ఊగుతూ కనిపించిన వీడియో అందర్న కలిచి వేస్తుంది. తాజాగా ఈ వీడియో చూసి మంత్రి నారా లోకేష్ చలించిపోయారు. ఆ చిన్నారికి నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు.

మంత్రి నారాలోకేష్ సోష‌ల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి అడిగినా, లేదా ఎవ‌రైనా సాయం చేయాల‌ని కోరినా వెంట‌నే స‌మాధానం, సాయం చేస్తూ తన గొప్ప మనసు చాటుకుంటుంటారు. ఇప్ప‌టికే ఎన్నో సమస్యలు , ఎంతోమందికి సోష‌ల్ మీడియా ద్వారా సాయం చేసిన లోకేష్ తాజాగా మ‌రో పోస్టుకు బ‌దులిచ్చారు. సంతోష్ కుమార్ అనే ఓ నెటిజ‌న్ చ‌దువుకు దూర‌మై, రోడ్డుపై భిక్షాట‌న చేస్తున్న ఓ చిన్నారి వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

వీడియోలో చిన్నారి రోడ్డుపై నిద్ర‌మ‌త్తులో కూర్చుని తూలుతున్నాడు. అత‌డి ఒంటిపై దెబ్బ‌లు త‌గిలి ఉండ‌టంతో పాటూ ఆక‌లితో అల‌మ‌టిస్తున్న‌ట్టు నెటిజ‌న్ పేర్కొన్నాడు. ఆ చిన్నారి క‌ర్నూలు సిటీలోని డ్రెస్ స‌ర్కిల్ వ‌ద్ద ఉన్నాడ‌ని ఎలాగైనా కాపాడి, అత‌డిని ఆదుకోవాల‌ని కోరాడు. త‌న పోస్టును మంత్రి లోకేష్ కు ట్యాగ్ చేయ‌గా వెంట‌నే స్పందించాడు. ఈ వీడియో హృద‌య‌విదార‌కంగా ఉంద‌ని విచారం వ్య‌క్తం చేశారు. ప్ర‌తి చిన్నారికి ప్రేమ‌, ర‌క్ష‌ణ అవ‌స‌ర‌మ‌ని లోకేష్ స్ప‌ష్టం చేశారు. ఆ చిన్నారి ఎక్క‌డ ఉన్నా చేర‌దీస్తామ‌ని, ర‌క్షిస్తామ‌ని హామీ ఇచ్చారు. అత‌డికి కావాల్సినవ‌న్నీ ఇప్పిస్తామ‌ని , అంతే కాకుండా చిన్నారిని కొట్టిన‌వారిని క‌ఠినంగా శిక్షిస్తామ‌ని హెచ్చ‌రించాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Read Also : World Philosophy Day : ప్రాథమిక విద్యలో పిల్లలకు తత్వశాస్త్రం ఎంత అవసరం..?