Site icon HashtagU Telugu

Human Fish : మనిషి లాంటి దంతాలు, పెదవులతో చేప.. అసలు విషయమిదీ ?

Human fish

Human fish

Human Fish : ఈ చేపను చూశారా ?  దీని పెదవులు, దంతాలపై ఓ లుక్ వేయండి.. అచ్చం మనుషుల దంతాలు, పెదవులను తలపిస్తున్నాయి కదా ?ఈ వెరైటీ చేప ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ చేప బరువు దాదాపు 1 కేజీ అని, దీని పొడవు 60 అంగుళాలు ఉంటుందని  అంటున్నారు.అదొక మంచినీటి జాతి చేప అని చెబుతున్నారు.  ఈ వెరైటీ ఫిష్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అసలు విషయం ఏమిటో తెలుసా ? ఈ ఫొటో ఫేక్.. ఒక సాధారణ చేప ఫొటోను ఎడిట్ చేసి.. దానికి మనిషి నోరు తెరిచి ఉన్న క్లిప్ ను ఇన్ సర్ట్ చేశారు.ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా ఉండటంతో అందులో మనిషి పెదవులు, దంతాలు నేచురల్ గా కనిపించేలా ఇమిడిపోయాయి. ఈ చేపకు రెక్కలను కూడా యాడ్ చేసి ఉండటాన్ని పైన ఉన్న ట్విట్టర్ పోస్ట్ లలో మీరు స్పష్టంగా చూడొచ్చు.