Site icon HashtagU Telugu

Aliens Day : నేడే “ఏలియన్స్ డే”.. స్పెషాలిటీ తెలుసా ?

Aliens Day

Aliens Day

Aliens Day : ఏలియన్స్ .. ఎగిరే పల్లాలు.. వీటిపై జనాలకు ఎంతో ఇంట్రెస్ట్ !!

ఇటువంటి వాటిని అన్ ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ (UFO) అంటారు.. 

ఇవాళ ప్రపంచ UFO దినోత్సవం సందర్భంగా కథనం..  

తొలిసారి UFO శకలాలు లభ్యం 

ప్రతి సంవత్సరం జూలై 2న ప్రపంచ UFO దినోత్సవాన్ని(Aliens Day) జరుపుకుంటారు. ఇది అంతుచిక్కని, మిస్టీరియస్ ఎగిరే వస్తువులకు డెడికేట్ చేసిన రోజు.  మొదటి UFO దినోత్సవాన్ని పరిశోధకుడు హక్తాన్ అక్డోగన్ 2001లో జరుపుకున్నారు.  1947 జూలై 2న ఒక UFO న్యూ మెక్సికోలోని పొలంలో కూలింది. అమెరికా ప్రభుత్వానికి చెందిన రోస్‌వెల్ ఆర్మీ ఎయిర్ ఫీల్డ్‌ అధికారుల బృందం అక్కడికి వెళ్లి UFO శకలాలను స్వాధీనం చేసుకుంది. వాటిలో ఫ్లయింగ్ డిస్క్ ఉన్నట్లు గుర్తించారు. అప్పటి  జూలై 2న ప్రపంచ UFO దినోత్సవాన్ని పాటిస్తున్నారు.

తొలిసారి UFO చూశారు  

తొలిసారిగా UFOను చూశానని అమెరికన్ వ్యాపారవేత్త కెన్నెత్ ఆర్నాల్డ్ 1947 జూన్ 24న ప్రకటించారు.  మౌంట్ రైనర్ చుట్టూ మెరుస్తూ ఎగురుతున్న తొమ్మిది వస్తువులను తాను చూశానని ఆర్నాల్డ్ పేర్కొన్నాడు. ఆ గుర్తుతెలియని వస్తువులు గంటకు కనీసం 1,200 మైళ్ల వేగంతో ఎగిరాయని చెప్పాడు.

Also read : 1st Mission To Dark Universe : “డార్క్” సీక్రెట్స్ తెలుసుకునేందుకు తొలి స్పేస్ క్రాఫ్ట్.. ఏం చేస్తుంది ?

ఆపరేషన్ సైన్.. ప్రాజెక్ట్ బ్లూ బుక్‌.. నాసా టీమ్ 

1947 జూలై 2, 1947 జూన్ 24 ఘటనల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం అప్పట్లో అలర్ట్ అయింది. UFOల మిస్టరీ గురించి తెలుసుకునేందుకు అమెరికా వైమానిక దళం “ఆపరేషన్ సైన్” పేరుతో దర్యాప్తును ప్రారంభించింది. అంతేకాదు అమెరికా వైమానిక దళం “ప్రాజెక్ట్ బ్లూ బుక్‌” అనే విభాగాన్ని స్థాపించింది.  దాని ప్రధాన కార్యాలయం ఓహియో రాష్ట్రంలోని  డేటన్ లో ఉంది. బ్లూ బుక్ ప్రాజెక్ట్ 1947 నుంచి 1969 మధ్యకాలంలో  12,000 కంటే ఎక్కువ UFO వీక్షణల సమాచారాన్ని సేకరించి విశ్లేషించింది.UFOలపై రీసెర్చ్ కోసం నాసా (NASA) 2022 జూన్ లో ఒక కొత్త  ప్రాజెక్ట్ ను ప్రకటించింది. ఇందులో ప్రముఖ ఏరో శాస్త్రవేత్తలను నియమించింది.

బస్తర్.. లక్నో.. UFOల చక్కర్లు 

ఇక మన భారతదేశంలో UFO గురించిన తొలి ప్రస్తావన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం నుంచి వచ్చింది. బస్తర్ ప్రాంతంలో  కనుగొన్న 10,000 సంవత్సరాల కిందటి రాక్ పెయింటింగ్‌లలో UFOలు ఉన్నాయని గుర్తించారు. చైనా బార్డర్ లో ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) వెంట UFOలు కనిపించాయనే ప్రచారం 2013లో జరిగింది. 2014లో లక్నోలో కొంతమంది వ్యక్తులు రాత్రి టైంలో..  ఆకాశంలో ఎగిరే పళ్లెం చూశామని చెప్పారు.