Site icon HashtagU Telugu

Cough Syrup : 2 దగ్గు టానిక్ లపై WHO వార్నింగ్..ఉజ్బెకిస్థాన్‌లో 19 మంది చిన్నారుల మరణాలతో కలకలం

Cough in Kids

Cough Syrup

భారత ఫార్మాస్యూటికల్ కంపెనీ — మారియన్ బయోటెక్‌కు చెందిన రెండు దగ్గు సిరప్‌లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) (World Health Organisation) హెచ్చరికలు జారీ చేసింది. ఈ మందులను పిల్లలకు వాడొద్దని సలహా ఇచ్చింది. కంపెనీకి చెందిన రెండు దగ్గు సిరప్‌లు (Cough Syrup) నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని, వాటి విక్రయాలను పూర్తిగా నిషేధించాలని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. ఉజ్బెకిస్థాన్‌లో 19 మంది చిన్నారుల మరణాల ఉదంతంతో ఈ టానిక్ కు లింక్స్ ఉన్నాయనే అభియోగాల నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ ఈ ప్రకటన చేసింది. మారియన్ బయోటెక్‌ కంపెనీకి చెందిన ఆంబ్రోనాల్ సిరప్, డిఓకె-1 మ్యాక్స్ సిరప్‌లను మార్కెట్‌లో విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ కార్యాలయం నోయిడా సెక్టార్ 67లో ఉంది.

డైథైలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ అధిక మోతాదులో..

పిల్లల మరణాలను దృష్టిలో ఉంచుకుని.. ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రెండు సిరప్‌లను పరిశీలించింది. వాటిలో డైథైలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ అధిక మోతాదులో ఉన్నట్లు గుర్తించింది. పిల్లల మరణానికి ఇదే కారణమైంది. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న 21 మంది పిల్లలు ఈ మందులను సేవించారని, వారిలో 19 మంది మరణించారని వెల్లడైంది.

Also Read:  Blood Group : హార్ట్ స్ట్రోక్ ఎప్పుడు వస్తుందో బ్లడ్ గ్రూప్ చూసి చెప్పేయొచ్చా..?

రాయిటర్స్ నివేదిక ప్రకారం..

వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. (Reuters ) ఈ ఔషధాల భద్రత, నాణ్యతకు సంబంధించి మారియన్ బయోటెక్‌ కంపెనీ ఇంకా WHOకి హామీ ఇవ్వలేదు. ఉజ్బెకిస్థాన్‌లో (Uzbekistan) మరణాల వార్త వచ్చిన వెంటనే.. భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆ కంపెనీలో మందుల ఉత్పత్తిని నిషేధించింది.  గురువారం రోజున ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేసింది.మారియన్ బయోటెక్‌ కంపెనీ 2012 నుంచి ఉజ్బెకిస్తాన్‌లో నమోదు చేయబడింది. ఆ సంవత్సరం నుంచే అది మందులను తయారు చేసి విక్రయిస్తోంది. అయితే, ఈ కంపెనీకి చెందిన మందులు భారతదేశంలో విక్రయించడం లేదు.

నలుగురు అరెస్ట్

గత వారంలో ఉజ్బెకిస్తాన్‌లో 19 మంది పిల్లల దగ్గు-సిరప్ సంబంధిత మరణాలపై దర్యాప్తు చేసిన పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ఇంతకుముందు గాంబియాలో కూడా దగ్గు టానిక్ కారణంగా కనీసం 70 మంది పిల్లలు మరణించిన కేసు ఉంది. గాంబియా పార్లమెంటరీ కమిటీ ఈ మరణాలను న్యూఢిల్లీకి చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన దగ్గు సిరప్‌తో ముడిపెట్టింది. ఔషధం నాణ్యతలో ఎలాంటి లోపం లేదని కంపెనీ ఖండించింది. అయితే ఆ టానిక్ ను భారత ప్రభుత్వం పరీక్షించగా, దానిలో లోపాలు లేవని తేలింది.