Site icon HashtagU Telugu

AI Putin Vs Putin : ఏఐ పుతిన్‌తో రియల్ పుతిన్ చిట్‌చాట్.. ఏం మాట్లాడుకున్నారంటే..

Ai Putin Vs Putin

Ai Putin Vs Putin

AI Putin Vs Putin : ఏఐ టెక్నాలజీ ఎంతటి విప్లవాన్ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా తన ఏఐ వర్షన్‌తో స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చిట్‌చాట్ చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ప్రతి సంవత్సరం చివరి నెలలో దేశ ప్రజలతో ఫోన్ -ఇన్‌లో గంటల కొద్దీ మాట్లాడుతారు. తాజాగా గురువారం రోజు ఆ కార్యక్రమం సుదీర్ఘంగా జరిగింది. ఈ కార్యక్రమం నాలుగో గంటలో  వచ్చిన ఒక ఫోన్ కాల్ పుతిన్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

అచ్చం పుతిన్ ‌లాగే కనిపించే ఒక ఏఐ వర్షన్.. వ్లాదిమిర్ పుతిన్‌‌కు ఫోన్ కాల్ చేసింది. ఆ ఏఐ పుతిన్ తనను తాను సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్సిటీ విద్యార్థిగా పరిచయం చేసుకున్నాడు.  ‘‘పుతిన్ గారు మీకు చాలా డబుల్స్ ఉన్నాయని అంటారు నిజమేనా?  ఏఐ టెక్నాలజీ, న్యూరల్ నెట్‌వర్క్‌లు మన జీవితాల్లోకి తెచ్చే ప్రమాదాలను మీరు ఎలా చూస్తారు?’’ అని రియల్ పుతిన్‌కు ఏఐ పుతిన్(AI Putin Vs Putin) ప్రశ్న వేశాడు. దీంతో ఆ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులంతా నవ్వులు చిందించారు.

Also Read: Woman Judge Harassment : చనిపోయేందుకు అనుమతివ్వండి.. మహిళా జడ్జి ఓపెన్ లెటర్

‘‘మీరు నన్ను పోలి ఉన్నారు. నా స్వరంతో మాట్లాడుతున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రమే నాలా ఉండాలని, నా స్వరంతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. ఇక నేను ఒక్కడినే ఉంటా’’ అని వ్లాదిమిర్ పుతిన్ ఆన్సర్ ఇచ్చారు.  ‘‘మీరే నా డబుల్‌లా కనిపిస్తున్నారు’’ అంటూ ఏఐ పుతిన్‌పై సెటైర్ వేసి నవ్వులు పూయించారు.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనకున్న ఆరోగ్య సమస్యల కారణంగా కొన్నిసార్లు బయట మీటింగ్‌లకు తన డూప్‌లను పంపిస్తుంటారని అంటారు. అయితే ఈ వాదనలను గతంలో పుతిన్ కార్యాలయం ఖండించింది.