China Dna Attack : టిబెటన్లపై డీఎన్‌ఏ అటాక్.. చైనా ఏం చేస్తోందంటే ?

చైనా ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఇరుగుపొరుగు దేశాలపై దాని వేధింపులు ఆగడం లేదు. ఓ వైపు హాంకాంగ్ పౌరులను వేధిస్తున్న చైనా.. మరోవైపు టిబెట్ పౌరులను కూడా ఇబ్బంది(China Dna Attack) పెడుతోంది.

  • Written By:
  • Publish Date - May 15, 2023 / 01:06 PM IST

చైనా ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఇరుగుపొరుగు దేశాలపై దాని వేధింపులు ఆగడం లేదు. ఓ వైపు హాంకాంగ్ పౌరులను వేధిస్తున్న చైనా.. మరోవైపు టిబెట్ పౌరులను కూడా ఇబ్బంది(China Dna Attack) పెడుతోంది. టిబెట్‌ స్వతంత్ర ప్రాంతం (TAR) పై దశాబ్దాలుగా దురాగతాలను సాగిస్తోన్న చైనా.. ఇప్పుడు అక్కడి పౌరుల నుంచి బలవంతంగా డీఎన్‌ఏ శాంపిల్స్ (China Dna Attack)ను సేకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ఆరేళ్లలో సుమారు 12లక్షల మంది టిబెట్‌ స్వతంత్ర ప్రాంతం ప్రజల నుంచి డీఎన్‌ఏ శాంపిల్స్ ను చైనా పోలీసులు సేకరించారని ఒక అధ్యయన నివేదిక వెల్లడించింది. ఆ ప్రాంతంలోని మూడో వంతు ప్రజల నుంచి శాంపిల్ సేకరణ ఇప్పటికే పూర్తి అయిందని అంచనా. పేరెంట్స్, కుటుంబీకుల అనుమతి లేకుండా టిబెట్‌ పౌరుల డీఎన్‌ఏలను చైనా సేకరిస్తోందని ఇటీవల హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ నివేదిక ప్రస్తావించింది. టిబెట్‌ పౌరులను నియంత్రించడం, పర్యవేక్షించడం కోసమే డ్రాగన్ ఇటువంటి చర్యలకు తెగబడుతోందనే ఆరోపణలు ఉన్నాయి.

also read : China: పిల్లలను కనడానికి కొత్త నిబంధనలను రూపొందిస్తున్న చైనా..!

మానవ హక్కుల ఉల్లంఘనే 

చైనా ఈ తరహా చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని అమెరికా విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్‌ కామెంట్ చేశారు. మానవ జన్యు సమాచారం సేకరణ మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు. బ్లింకెన్‌ వ్యాఖ్యలను అంతర్జాతీయ టిబెట్‌ ప్రచార సంస్థ (ICT) స్వాగతించింది. ‘సామాజిక నియంత్రణ పద్ధతులకు ప్రయోగశాలగా టిబెట్‌ను చైనా వాడుతోంది’ అని పేర్కొంది. 13వ శతాబ్దం మధ్య కాలం నుంచే టిబెట్ తమ దేశంలో భాగంగా ఉందని చైనా వాదిస్తోంది. కానీ టిబెటన్లు మాత్రం తాము ఎన్నో శతాబ్దాల పాటు స్వతంత్ర రాజ్యంగా ఉన్నామని, తమపై చైనా అధికారం చెల్లదని వాదిస్తున్నారు. యువాన్ రాజవంశాన్ని స్థాపించి.. తన రాజ్యాన్ని టిబెట్‌తో పాటు చైనా, వియత్నాం, కొరియా వరకూ విస్తరించాడు. తర్వాత 17వ శతాబ్దంలో చైనా చింగ్ రాజవంశానికి టిబెట్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. 1951లో వేలాది మంది సైనికులను పంపి టిబెట్‌ను చైనా ఆక్రమించుకుంది.