Site icon HashtagU Telugu

TTD : 2022 సంవత్సరంలో తిరుమల శ్రీవారి ఆదాయం రూ.1,320 కోట్లు

TTD Devotees

Tirumala Srivari Income In 2022 Is Rs.1,320 Crores Ttd

కరోనా (Corona) ప్రభావం వల్ల 2020, 2021లో తిరుమల (Tirumala) క్షేత్రంలో తీవ్ర ఆంక్షల వల్ల భక్తులు పెద్దగా రాలేకపోయారు. 2022లో ఆ పరిస్థితి లేదు. ఆంక్షల ఎత్తివేతతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. స్వామి వారి హుండీ కూడా అదే స్థాయిలో కళకళలాడింది. ఈ ఏడాది తిరుమల వెంకన్నకు కేవలం హుండీ కానుకల రూపేణా రూ.1,320 కోట్లు లభించింది. ఈ మేరకు టీటీడీ (TTD) శ్వేతపత్రంలో పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వామివారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సంవత్సరం ఇప్పటిదాకా స్వామివారిని 2.35 కోట్ల మంది దర్శనం చేసుకున్నారని, 1.08 కోట్ల మంది భక్తుల తలనీలాల మొక్కులు సమర్పించుకున్నారని, 11.42 కోట్ల లడ్డూల విక్రయాలు జరిగాయని టీటీడీ (TTD) వివరించింది.
Also Read:  TTD : తిరుమలలో సిఫారసు లేఖలకు అనుమతి లేదు: వైవీ సుబ్బారెడ్డి