Site icon HashtagU Telugu

Total Solar Eclipse 2024 : సంపూర్ణ సూర్యగ్రహణం వీడియోలు, విశేషాలు ఇవిగో

Total Solar Eclipse 2024

Total Solar Eclipse 2024

Total Solar Eclipse 2024 : సంపూర్ణ సూర్యగ్రహణం దృశ్యాన్ని ఉత్తర అమెరికావాసులంతా ఒక పండుగలా  చూశారు. దాదాపు కోటి మంది ప్రజలు దీన్ని వివిధ మాధ్యమాల ద్వారా వీక్షించి ఆనందించారు. సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఉత్తర అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 11:07 గంటలకు (1807 GMT) సూర్యుడికి ఎదురుగా చంద్రుడు రావడంతో మెక్సికోలోని పసిఫిక్ తీరం పట్టపగలే గాఢ అంధకారంలోకి వెళ్లింది. ఈ విభిన్న మార్పును కళ్లారా చూసి ఉత్తర అమెరికా ప్రజలు ఆనందంలో మునిగి తేలారు. కేరింతలు చేశారు.

ఆ వెంటనే అమెరికాలోని చాలా రాష్ట్రాల్లోనూ సంపూర్ణ సూర్యగ్రహణం దృశ్యం  కనిపించింది.  కెనడాలోని అట్లాంటిక్ తీర ప్రాంతాల్లోనూ సంపూర్ణ సూర్యగ్రహణం స్పష్టంగా కనిపించింది. సూర్యుడి కరోనా చంద్రుని వెనుక నుంచి ప్రకాశిస్తూ వీక్షకులను అబ్బురపరిచింది.  ‘‘ఇది అద్భుతమైనది. మేం ఇలాంటి సీన్ ఎన్నడూ చూడలేదు’’ అని ప్రజలు చర్చించుకున్నారు. ఈ గొప్ప సీన్‌ను తమ కెమెరాల్లో బంధించారు. మరికొందరు ఆనందాన్ని ఆపుకోలేక తోటి వారికి ముద్దులు పెట్టారు. ఇది చాలా అందమైన, మరపురాని రోజు అని మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join

డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారో తెలుసా ?

ఇక సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసేందుకు అమెరికాలోని టెక్సాస్, అర్కాన్సాస్, ఒహియో, మైనే సహా వివిధ రాష్ట్రాల ప్రైమ్ వ్యూయింగ్ లొకేషన్‌లలోని హోటళ్ళు ముందే బుక్ అయ్యాయి. ఆ హోటళ్ల నుంచి సూర్యగ్రహణ సీన్లను చూసి ప్రజలు ఆనందించారు.  సంపూర్ణ సూర్యగ్రహణం ముహూర్తంలోనే  అర్కాన్సాస్‌లోని రస్సెల్‌విల్లేలో 300 కంటే ఎక్కువ జంటల సామూహిక వివాహాలు జరిగాయని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.  ఇక అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న మాజీ  ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన తల సూర్యుడిని అడ్డుకుంటున్న విధంగా ఒక వెరైటీ ప్రచార ప్రకటనను విడుదల చేశారు. దానిపై ‘మేమే అమెరికాను రక్షిస్తాం’ అనే నినాదం రాశారు. దీనిపై ఎక్స్ వేదికగా స్పందించిన అధ్యక్షుడు జో బిడెన్ ‘‘డోంట్ బి సిల్లీ, ఫొల్క్స్’’ అని ఎగతాళి చేశారు.

Also Read : Ugadi Panchangam 2024 : ఈ ఏడాది మీ జాతకం ఎలా ఉందో ఓ లుక్ వేసుకోండి

నాసా ఏం చేసిందంటే..

మరోవైపు నాసా ఈ టైంలోనూ తన ప్రయోగాలను కొనసాగించింది. సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల అలుముకునే ఆకస్మిక చీకటితో వాతావరణం పైపొర అయానో స్పియర్‌లో వచ్చే మార్పులను తెలుసుకోవడానికిగానూ గ్రహణానికి కాసేపటి ముందు మూడు సౌండింగ్ రాకెట్‌లను నాసా ప్రయోగించింది.