Site icon HashtagU Telugu

Easter Festival : ఇవాళే ఈస్టర్.. ఈ పండుగ ఆదివారమే ఎందుకొస్తుంది ?

Easter Festival

Easter Festival

Easter Festival : ఇవాళే ఈస్టర్ పండుగ. ఇది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకునే పర్వదినం. ఈస్టర్ రోజున యేసు పునరుత్థానమయ్యారని నమ్ముతారు. పాత జీవితం ముగిసిన తర్వాత కొత్త జీవితం యొక్క ప్రారంభాన్ని ఈ పండుగ సూచిస్తుంది. గుడ్ ఫ్రైడే రోజున యూదులు జీసస్‌‌కు శిలువ వేసినట్లు నమ్ముతారు. అది జరిగిన మూడు రోజుల తరువాత.. అంటే ఆదివారం యేసు మళ్లీ మేల్కొన్నారని అంటారు. మరణాన్ని జయించి యేసు తిరిగొచ్చారని విశ్వసిస్తారు. అందుకే ప్రతీసారీ ఆదివారం రోజే  ఈస్టర్ వేడుకను నిర్వహిస్తారు. ఈ పండుగ రోజున క్రైస్తవులు చర్చికి వెళ్లి యేసును ప్రార్థిస్తారు.

We’re now on WhatsApp. Click to Join

ఈస్టర్ రోజున ఈస్టర్ ఎగ్స్(Easter Festival) అని పిలువబడే ప్రత్యేక గుడ్లను పంపిణీ చేస్తారు. వాటితో రకరకాల ఆటలు ఆడుతారు. తల్లిదండ్రులు ఈస్టర్ గుడ్లను దాచిపెడితే.. పిల్లలు వాటిని వెతికి తీసుకొస్తారు. ఈస్టర్ పండుగ వేళ రంగుల గుడ్లను అలంకరించడం అనేది 13 వ శతాబ్దం నాటి సాంప్రదాయం. ఈ కోడిగుడ్లు చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈస్టర్ కుందేలు తీసుకొచ్చిన ఈస్టర్ గుడ్ల కోసం వెతకడం అనే సంప్రదాయాన్ని కొన్ని దేశాల క్రైస్తవులు ఆచరిస్తుంటారు. దీన్ని చిన్నపిల్లల సరదా ఆటగా పరిగణించరు. సంతాన ప్రాప్తి కోసం చేసే ఆచారంగా భావిస్తారు. గుడ్డు దొరికితే సంతోషం, సిరిసంపదలు, మంచి ఆరోగ్యం, రక్షణ తీసుకొస్తుందని నమ్ముతారు. పిల్లలు కలగాలని కోరుకుంటూ ఈ ఈస్టర్ ఎగ్స్ ఒకరికొకరు ఇచ్చుకుంటారు. సంతాన సౌభాగ్యానికి వీటిని చిహ్నంగా భావిస్తారు.

Also Read : NOTA : ‘నోటా’కు ఓటేస్తే ఏమవుతుందో తెలుసా ? దీని చరిత్ర ఇదిగో

అయితే యేసుకు యూదులు శిలువ వేసిన సంవత్సరంపైనా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. AD 33 సంవత్సరంలో యేసుకు శిలువ వేశారని కొందరు నమ్ముతుంటారు. సర్ ఐజాక్ న్యూటన్ గ్రహాలు, నక్షత్రాల కదలికను కొలిచి ఆ సమయం వేరేవిధంగా ఉంటుందని మరికొందరు విశ్వసిస్తుంటారు.