Yasir Al Rumayyan : రిలయన్స్ కంపెనీ బోర్డులో యాసిర్‌.. ఆయన ఎవరు ?

యాసిర్‌ ఉస్మాన్ రుమయాన్‌.. ఈయన మరో ఐదేళ్ల కాలానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా నియమితులు అయ్యారు.

  • Written By:
  • Updated On - June 23, 2024 / 08:29 AM IST

Yasir Al Rumayyan : యాసిర్‌ ఉస్మాన్ రుమయాన్‌.. ఈయన మరో ఐదేళ్ల కాలానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా నియమితులు అయ్యారు. దీనికి సంబంధించి రిలయన్స్ వాటాదారులతో నిర్వహించిన ఓటింగ్‌లో 83.97 శాతం మంది అనుకూలంగా ఓటు వేశారు. 16.02 శాతం మంది వ్యతిరేకంగా ఓటువేశారు. ఈవివరాలను స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు రిలయన్స్‌ తెలియజేసింది. ఇంతకీ ఎవరీ  యాసిర్‌ ఉస్మాన్ రుమయాన్‌ ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

ఎవరీ యాసిర్‌ ఉస్మాన్ రుమయాన్‌ ? 

  • సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అత్యంత కీలక సలహాదారుల్లో ఈయన ఒకరు.
  • 2012 నుంచే సౌదీ అరేబియా మహారాజుగా సల్మాన్ వ్యవహరిస్తున్నారు.
  • ఈక్రమంలో 2016 సంవత్సరంలో కీలకమైన సౌదీ అరేబియా ప్రభుత్వ చమురు కంపెనీ ‘ఆరాంకో’కు ఛైర్మన్‌గా  యాసిర్‌ ఉస్మాన్ రుమయాన్‌ నియమితులు అయ్యారు.
  • మహ్మద్ బిన్ సల్మాన్‌కు అత్యంత సన్నిహితుడు కావడం వల్లే  యాసిర్‌ ఉస్మాన్ రుమయాన్‌‌కు ఈ అవకాశం దక్కిందని అంటారు.
  • 2017 సంవత్సరంలో సౌదీ అరేబియా యువరాజుగా మహ్మద్ బిన్ సల్మాన్ పేరును ప్రకటించారు.
  • 2019 సంవత్సరంలో రూ.6 లక్షల కోట్ల పెట్టుబడితో రిలయన్స్‌కు చెందిన చమురు, రసాయనాల వ్యాపారంలో 20 శాతం వాటాను సౌదీ ఆరాంకో దక్కించుకుంది. అందుకే రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో స్వతంత్ర డైరెక్టరుగా యాసిర్‌ ఉస్మాన్ రుమయాన్‌‌కు అవకాశం లభిస్తోంది.

Also Read :Shambala : నిత్యయవ్వనం ప్రసాదించే మూలికలు @ ‘శంబల’ !?

  • సౌదీ అరేబియా ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పీఐఎఫ్) వ్యవహారాలను కూడా యాసిర్‌ ఉస్మాన్ రుమయాన్‌‌  చూస్తుంటారు.
  • పీఐఎఫ్ పగ్గాలను ఆయన చేపట్టినప్పుడు దాని ఆస్తుల విలువ రూ.12 లక్షలు.. ఇప్పుడు దాని ఆస్తుల విలువ రూ.33 లక్షల కోట్లు.
  • యాసిర్‌ ఉస్మాన్ రుమయాన్‌‌(Yasir Al Rumayyan)  పీఐఎఫ్ పగ్గాలు చేపట్టడానికి ముందు.. ఆ సంస్థ 98 శాతం పెట్టుబడులు సౌదీలోనే పెట్టేది. ఈయన అందుకు భిన్నంగా విదేశాల్లో 20 శాతం, సౌదీలో 80 శాతం పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టారు.
  • ఈక్రమంలోనే ఇండియాలోని రిలయన్స్‌లో పెట్టుబడులు పెట్టారు.
  • ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన జపాన్ సాఫ్ట్ బ్యాంకులోనూ సౌదీ ఆరాంకోకు భారీగా పెట్టుబడులు ఉన్నాయి. ఆ కంపెనీ బోర్డులోనూ డైరెక్టరుగా యాసిర్‌ ఉస్మాన్ రుమయాన్‌‌  ఉన్నారు. మన దేశంలోని రిలయన్స్ సహా ఎన్నో దిగ్గజ కంపెనీలకు సాఫ్ట్ బ్యాంకు భారీగా లోన్లు ఇచ్చింది.
  • ప్రపంచ ప్రఖ్యాత ఉబెర్ కంపెనీలోనూ సౌదీ ఆరాంకోకు పెట్టుబడులు ఉన్నాయి. ఆ కంపెనీ బోర్డులోనూ సభ్యుడిగా  యాసిర్‌ ఉస్మాన్ రుమయాన్‌‌  ఉన్నారు.

Also Read : Hardik Pandya: హార్దిక్‌ పాండ్యా అరుదైన ఘనత.. టీమిండియా తొలి ఆల్‌ రౌండర్‌గా రికార్డు!