National Cat Day 2023 : అంతర్జాతీయ పిల్లి దినోత్సవం..ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

పిల్లుల (Cats Day) గురించి ప్రజలకు అవగాహనా కల్పించడానికి , వాటిని రక్షించడానికి , వాటికీ సహాయపడడానికి

  • Written By:
  • Updated On - August 8, 2023 / 12:57 PM IST

National Cat Day 2023 : ఈరోజు ప్రత్యేకతల్లో అంతర్జాతీయ పిల్లి దినోత్సవం (National Cat Day ) ఒకటి. అంతర్జాతీయ పిల్లి దినోత్సవాన్ని ఆగస్టు 08 న జరుపుకుంటారు. కెనడాలోని అతిపెద్ద జంతు సంక్షేమ సంస్థైన ‘ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ యానిమల్ వెల్ఫేర్’ ( International Fund for Animal Welfare ) 2002 లో అంతర్జాతీయ పిల్లి దినోత్సవాన్ని జరుపుకుంది. అప్పటి నుండి ప్రతి ఏడాది ఆగస్టు 08 న అంతర్జాతీయ పిల్లి దినోత్సవాన్ని జరుపుతూ వస్తుంది.

పిల్లుల (Cats Day) గురించి ప్రజలకు అవగాహనా కల్పించడానికి , వాటిని రక్షించడానికి , వాటికీ సహాయపడడానికి, వాటి మార్గాలను తెలుకోవడానికి పిల్లి జాతి దత్తత గురించి అవగాహనా కల్పించేందుకు అంతర్జాతీయ పిల్లి దినోత్సవాన్ని జరుపుతుంటారు. నిషి యొక్క సాధారణ మరియు పెంపుడు జంతువులలో పిల్లి కూడా ఒకటి.

పిల్లులు ఈ గ్రహం మీదున్న చక్కటి జీవులలో ఒకటి. పిల్లులు స్వతంత్రమైనవి..సాహసోపేతమైనవి ..పరిశోధాత్మకమైనవి..అద్భుతమైన శరీర ధర్మమైనవి మరియు శక్తిని కలిగి ఉంటాయి. పిల్లులు మాంసాహారులు మరియు క్షిరదారులు..వాటిని మనం పెంచకపోయిన..వాటిని గౌరవంగా చూడాలని జంతు ప్రేమికులు చెపుతుంటారు.

అంతర్జాతీయ పిల్లి దినోత్సవాన్ని కొన్ని దేశాలు World Cat Day గా జరుపుకుంటారు. మనదేశంలో పిల్లిని పెంచుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపించారు కానీ, ఇతర దేశాల్లో పిల్లినే ఎక్కువగా పెంపుడు జంతువు గా పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

  • * పిల్లులు (Cats ) ఎక్కువగా ఎప్పుడు చూస్తాయి..ఎప్పుడు పడుకుంటాయో మీకు తెలుసా..?

సాధారణంగా పిల్లులు పగటిపూట చూడడం కష్టం. రాత్రి సమయంలో మనుషులకంటే 7 రేట్ల తక్కువ కాంతితో పిల్లులు స్పష్టంగా చూడగలవు. పిల్లులు 70 శాతం నిద్రలోనే గడుపుతాయి. అందుకే ఎక్కడ చూసిన పిల్లులు కునుకేస్తూ కనిపిస్తుంటాయి. పిల్లులు తమ చెవులను నియంత్రించేందుకు 20 కంటే ఎక్కువ కండరాలను ఉపయోగిస్తాయి. అలాగే వాటి చెవులను 180 డిగ్రీలకు తరలించగలవు.

  • * పిల్లి (Cat) ఫై ఉండే నమ్మకాలు.. అపనమ్మకాలు గురించి మీకు తెలుసా..?

ప్రపంచంలో మనుషుల్లో కొన్నింటిపై అపారమైన అపనమ్మకం ఉంటుంది. మరికొంతమందిలో ఎంతో నమ్మకం ఉంటుంది. వాటికీ ఎంతో విలువనిస్తారు. ముఖ్యంగా కొన్ని శకునాలు బాగా విశ్వసిస్తారు. వాటిలో పిల్లి ఎదురురావడం అశుభంగా పరిగణిస్తారు. అందులోనూ నల్ల పిల్లి ఎదురువచ్చిందంటే ఇక అంతే.. కాసేపు ఆగి మళ్లీ ప్రయాణాన్ని కొనసాగిచడమో..లేదంటే మనుకోవడమో చేస్తారు.

  •  మనదేశంలో పిల్లి (Cat) ఎదురైతే అశుభ సూచకం అంటారు.. ఎందుకంటే..

పిల్లి అశుభానికి సూచనగా మనదేశంలో చెపుతుంటారు. పిల్లి ఎప్పుడు యజమాని మంచి కోరుకోదని, దానిని ఎంత ప్రేమగా పెంచినా యజమాని నాశనాన్ని కోరుకుంటుంది అంటారు. ప్రతినిత్యం పిల్లికి పాలు పోసి పెంచినా, అది మళ్లీ ఇంట్లో ఉన్న పాలను దొంగతనంగా తాగాలని ప్రయత్నిస్తుందని, అలాంటి దుష్టబుద్ధి ఉన్న పిల్లిని బయటకు వెళ్ళేటప్పుడు చూస్తే మంచి జరగదని భావిస్తారు. కుక్క యజమాని మంచి కోరితే, విశ్వాసంగా ప్రవర్తిస్తే, పిల్లి మాత్రం యజమాని నాశనం కోరుకునే దుర్బుద్ధి ఉంటుందని చెప్తారు.

అంతేకాదు పిల్లిని (Cat) దరిద్ర దేవతకు చిహ్నంగా పరిగణిస్తారు. ఆధ్యాత్మిక గ్రంథాలలో సంపదకు దేవత మహాలక్ష్మి అయితే పేదరికానికి, ఇబ్బందులకు దరిద్ర దేవత అని భావిస్తారు. పిల్లి దరిద్రాన్ని, ఇబ్బందులను మోసుకు వస్తుంది కాబట్టి పిల్లిని భారతీయులు దురదృష్టానికి చిహ్నంగా చూస్తారు. అందుకే పిల్లి ఎదురుపడితే కాసేపు ఆగి వెళ్లాలని భావిస్తారు. ఒకవేళ పట్టించుకోకుండా వెళ్తే కచ్చితంగా వెళ్ళిన పని కాకపోగా చిరాకు కలుగుతుందని అంటారు.

  • అదే కొన్ని దేశాల్లో మాత్రం ఇందుకు పూర్తి విరుద్దంగా ఉంటాయి.

యునైటెడ్ కింగ్డమ్ (United Kingdom) :

పెళ్లి రోజున వధువుకు నల్ల పిల్లిని బహుమతిగా ఇవ్వడం అదృష్టంగా భావిస్తురు యూకే ప్రజలు. కొత్తగా పెళ్లయిన వారి ఇంట్లో పిల్లి ఉంటే అది చెడును దూరం చేస్తుందని నమ్ముతారు. పిల్లి నలుపు రంగు అయితే మరింత అదృష్టం అని.. అక్కడివారికి ఆ రంగు అంటే అంత పిచ్చి.

జపాన్ (Japan) :

నలుపు లేదా స్వచ్ఛమైన తెల్లని పిల్లులు తమ ఇళ్లకు వస్తే శ్రేయస్సు , అదృష్టాన్ని తెస్తాయని జపాన్‌ జనాలు నమ్ముతారు. జపనీయుల నమ్మకం ప్రకారం నల్ల పిల్లులు చెడుతోపాటు శత్రువులను దూరం చేస్తాయని కూడా విశ్వస్తారు.

ఫ్రాన్స్ (France) :

ప్రాన్స్‌లో నల్ల పిల్లులను మాగోట్స్ అని పిలుస్తారు. ఫ్రాన్స్‌లోని నమ్మకాల ప్రకారం.. అక్కడివారు నల్ల పిల్లికి సరిగ్గా ఆహారం ఇస్తే ఆ రోజు అద్భుతమైన అదృష్టం కలిసి వస్తుందని అనుకుంటారు.

స్కాట్లాండ్ (Scotland) :

నలుపు లేదా ఏదైనా రంగు పిల్లి కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే సంపద త్వరలో తలుపు తడుతుందని స్కాటిష్‌ల భారీ నమ్మకం. ఇందు కోసం వారు గృహ ప్రవేశాల రోజు తమ ఇంటికి పిల్లి రావాలని కోరుకుంటారు.

నార్వే (Norway) :

నల్ల పిల్లులు ప్రేమకు చిహ్నాలు. అవి సంతానోత్పత్తిని పెంచుతాయని నార్వేజియన్ పురాణాలు చెబుతున్నాయి. కారణం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. నల్ల పిల్లులు ప్రేమ, సంతానోత్పత్తి దేవత అని వారు కొలిచే, ఆరాధించే దేవుడి ఫ్రీజా రథాన్ని అవి లాగుతాయని అనుకుంటారు.

ఈజిప్ట్ (Egypt) :

ఈజిప్టులో నల్ల పిల్లులను దేవతలుగా పూజిస్తారు. వాటిని మనోహరంగా ఆప్యాయతతో తెలివైనవిగా నమ్ముతారు. నిజానికి ఆ కుటుంబంలో నల్ల పిల్లి చనిపోతే ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోతుంది. మరికొన్ని చోట్ల పిల్లులను దేవతలుగా కొలుస్తారు.

ఇక పిల్లిపై మన తెలుగులో (AP and Telangana) గల కొన్ని సామెతలు ఉన్నాయి అవి ఏంటి అంటే..

* పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం.
* పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరూ గమనించలేదనుకొనిందట.
* పొయ్యిలో నుండి పిల్లి లేవలేదు.

సో..మీ ఇంట్లో పెంపుడు పిల్లి ఉంటె దానికి శుభాకాంక్షలు తెలపండి..మీ Hashtagu టీం.