Victory On Paralysis : పక్షవాతంపై విజయం.. మెదడు, వెన్నెముకపై కంట్రోల్

పక్షవాతం(Victory On Paralysis) వస్తే  మంచానికే పరిమితం.. ఇది పాత ముచ్చట !!

  • Written By:
  • Updated On - May 28, 2023 / 10:28 AM IST

Victory On Paralysis : పక్షవాతం వస్తే  మంచానికే పరిమితం.. ఇది పాత ముచ్చట !!

వైద్యరంగం అంతలా అప్ డేట్ అవుతోంది !!

 పరిశోధనలు రాకెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి !! అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఫలితాలను సాధిస్తున్నాయి!! 

ఈ కోవలోకే వస్తుంది స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉన్న స్విస్ ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (EPFL) ఇన్ స్టి ట్యూట్ ఇటీవల చేసిన మెడికల్ రీసెర్చ్.

ఈ ఇన్ స్టి ట్యూట్ కు చెందిన వైద్య నిపుణుడు గ్రెగోయిర్ కోర్టైన్, అతడి టీమ్ ఒక పక్షవాత రోగిపై(Victory On Paralysis) అరుదైన వైద్య ప్రయోగం చేసి విజయం సాధించింది.

నెదర్లాండ్స్ దేశానికి చెందిన 40 ఏళ్ల గెర్ట్ జాన్ ఓస్కామ్ 12 ఏళ్ళ క్రితం(2011 సంవత్సరంలో)  సైకిల్ పై వెళ్తుండగా యాక్సిడెంట్ అయింది. దీంతో అతడి మెడ భాగంలోని వెన్నుపాము కు తీవ్ర  గాయం అయింది. దీంతో అతడు ఆనాటి నుంచి మంచంపైనే ఉన్నాడు. 2021లో అతడు తెలిసిన వారి ద్వారా జెనీవాలో ఉన్న స్విస్ ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (EPFL) ఇన్ స్టి ట్యూట్ కు వచ్చాడు.  గెర్ట్ జాన్ ను ప్రొఫెసర్ బ్లాచ్ చెక్ చేసి.. కాళ్ళ, పాదాల, మోకాళ్ళ కదలికలను  పునరుద్ధరించే ఆపరేషన్ చేస్తానని చెప్పారు.  2021 జూలై లో గెర్ట్ జాన్ పుర్రె యొక్క రెండు మూలల్లో  చెరో  5 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన రెండు  వృత్తాకార రంధ్రాలను చేసి.. వాటి ద్వారా మెదడు పై పొరకు అటాచ్ అయ్యేలా డిస్క్ ఆకారపు చెరొక  ఇంప్లాంట్‌ ను ఒక్కోవైపు అమర్చారు. హెడ్ ఫోన్ తరహా ఒక పరికరాన్ని తయారుచేసి.. దాని రెండు మూలల్లో చెరో సెన్సర్ ను  బిగించారు. మెదడు పై పొరల్లో అటాచ్ చేసిన రెండు డిస్క్ ఆకారపు ఇంప్లాంట్‌ లు మెదడు సంకేతాలను గ్రహించి వాటిని  వైర్‌ లెస్‌గా మార్చి.. హెడ్ ఫోన్ తరహా పరికరంలోని రెండు సెన్సర్లకు చేరవేస్తాయి.  ఇదంతా ఒక సర్జరీ ద్వారా సాధించిన ఫలితం!!

రెండో సర్జరీ..

ఆ తర్వాత గెర్ట్ జాన్ వెన్నెముక చుట్టూ మరో సర్జరీ చేశారు. వెన్నెముకలో మన నడకకు సంబంధించిన కొన్ని నరాలు ఉంటాయి.  ఆ నరాల చివరలలో మరో ఇంప్లాంట్ ను వైద్యులు అమర్చారు. మెదడులోని రెండు ఇంప్లాంట్స్ నుంచి రిలీజ్ అయ్యే  సిగ్నల్స్  హెడ్ ఫోన్ తరహా పరికరంలోని రెండు సెన్సర్లకు.. అక్కడి నుంచి నేరుగా గెర్ట్ జాన్ కంప్యూటర్ కు వెళతాయి. అందులో ఉన్న స్పెషల్ అల్గారిథంతో కూడిన సాఫ్ట్ వేర్  ఆ సిగ్నల్స్ ను నడవడానికి సంబంధించిన సంకేతాలుగా మార్చి వెన్నెముకలోని  ఇంప్లాంట్ కు పంపిస్తాయి. గెర్ట్ జాన్ కంప్యూటర్  లో ఉన్న సాఫ్ట్ వేర్ ను కూడా స్విస్ ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (EPFL) ఇన్ స్టి ట్యూట్ పరిశోధకులే తయారు చేశారు.

ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే..

ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే.. గెర్ట్ జాన్ కు నడవాలనే ఆలోచన వచ్చినప్పుడు!!  అతడు వాకింగ్ స్టిక్ పై ఉండే బటన్ ను పదే పదే ప్రెస్ చేసి నిలబడే ప్రయత్నం చేసినప్పుడు!! ఇవి చేసినప్పుడు గెర్ట్ జాన్ మెదడు నుంచి సిగ్నల్స్ జనరేట్ అవుతాయి. అవే.. ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా ప్రాసెస్ అయి.. మెదడులోని నాడీ కణాలను,   వెన్నెముకలోని నరాలను  రీ యాక్టివేట్ చేస్తాయి. ఇదంతా జరుగుతోంది కాబట్టే .. ఇప్పుడు గెర్ట్ జాన్ కొంచెమైనా నడవగలుగుతున్నాడు. ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు లేచి నిలబడి వెల్కమ్ చెబుతున్నాడు. ఇంట్లో పై అంతస్తుకు వెళ్లి రాగలుగుతున్నాడు.