Site icon HashtagU Telugu

Chandrayaan3 – Gadwal Techie : చంద్రయాన్-3లో తెలుగు తేజం.. సాఫ్ట్ వేర్ టీమ్ లో గద్వాల్ టెకీ

Chandrayaan3 Software Gadwal Techie

Chandrayaan3 Software Gadwal Techie

Chandrayaan3  – Gadwal Techie  : ఇవాళ చంద్రయాన్-3 ల్యాండింగ్ జరగబోతున్న వేళ ..  తెలుగు ప్రజలను గర్వించేలా చేసే ఒక విషయం  వెలుగులోకి వచ్చింది.  చంద్రయాన్-3 చివరి దశ దాకా చేరడంలో దానికి సంబంధించిన సాఫ్ట్ వేర్ కీలక పాత్ర పోషించింది. చంద్రయాన్-3 మిషన్ లో AHVC, ILSA అనే రెండు పేలోడ్స్ కు సంబంధించిన డేటా ప్రాసెసింగ్ అనాలసిస్ సాఫ్ట్ వేర్ ను రాసింది మన తెలుగు యువతేజమే. ఈ సాఫ్ట్ వేర్ ను రాసిన  ఐదుగురు సాఫ్ట్ వేర్ నిపుణుల టీమ్ లో తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లికి చెందిన కృష్ణ కుమ్మరి కూడా ఉన్నారు.  ఆయనకు 2018లో  ఇస్రోలోని యూనిట్ ల్యాబోరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్ లో గ్రూప్ ‘ఏ’ గెజిటెడ్ అధికారిగా జాబ్ వచ్చింది. ఈ సాఫ్ట్‌వేర్ పేలోడ్స్ నుంచి వచ్చే డేటాని ఇస్రోకు చెందిన బెంగళూరులోని  ISTRAC సెంటర్ అందుకుంటుంది.

Also read :Chandrayaan – 3 Landing in 4 Stages : చివరి 17 నిమిషాలలో.. 4 దశల్లో ల్యాండింగ్.. వివరాలివీ

ఉండవల్లికి చెందిన లక్ష్మీదేవి, మద్దిలేటి దంపతుల కుమారుడే కృష్ణ కుమ్మరి.  ఆయన పదో తరగతి వరకు ఉండవల్లి జడ్పీ హైస్కూల్ లో చదువుకున్నారు. ఆ తర్వాత తిరుపతిలో డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (DCME) చేశారు. అనంతరం ఈ-సెట్ ఎగ్జామ్ రాసి హైదరాబాద్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. కాలేజీ ప్లేస్‌మెంట్‌ లో భాగంగా టెరా డేటా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో మూడున్నర సంవత్సరాలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేశారు. ఉద్యోగం చేస్తున్న క్రమంలోనే ఇస్రోలో ఐసీఆర్బీ పరీక్ష రాసి ఆలిండియా 4వ ర్యాంకును కృష్ణ (Chandrayaan3 Software -Gadwal Techie)  సాధించారు.

Also read : Moon Landing Vs Mars Landing : మూన్ ల్యాండింగ్ ఈజీనా ? మార్స్ ల్యాండింగ్ ఈజీనా ?