Site icon HashtagU Telugu

Robotic Kidney Transplant: రోబోతో కిడ్నీ మార్పిడి.. అస‌లు రోబోటిక్ కిడ్నీ మార్పిడి అంటే ఏమిటి..?

Robotic Kidney Transplant

Safeimagekit Resized Img (4) 11zon

Robotic Kidney Transplant: దేశంలోనే తొలిసారిగా ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో రోబోతో కిడ్నీ (Robotic Kidney Transplant) మార్పిడి చేశారు. మీడియా కథనాల ప్రకారం.. తాజాగా ఆర్మీ హాస్పిటల్ RR కూడా ఈ ఘనతను సాధించింది. ఇటీవల ఆర్మీ హాస్పిటల్ RRలో విజయవంతమైన రోబోటిక్ కిడ్నీ మార్పిడి జరిగింది. 179 మెడ్ రెజిమెంట్‌కు చెందిన హవల్దార్ భోజ్‌రాజ్ సింగ్ భార్య అనిత (33 సంవత్సరాలు) విజయవంతంగా రోబోటిక్ కిడ్నీ మార్పిడి చేయించుకుందని మీడియా నివేదిక‌లు పేర్కొన్నాయి. ఆమె భర్త భోజరాజ్ సింగ్ ఆమెకు కిడ్నీ ఇవ్వగా, ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్యం బాగానే ఉంది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ తర్వాత ఆర్మీ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ రెఫరల్ (AHRR) రోబోటిక్ రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రోగ్రామ్ ప్రారంభించబడిన దేశంలో రెండవ ప్రభుత్వ ఆసుపత్రిగా అవతరించింది.

రోబోటిక్ కిడ్నీ మార్పిడి అంటే ఏమిటి..?

నేటి యుగంలో రోబోటిక్ సర్జరీ అత్యంత అధునాతనమైన శస్త్రచికిత్స అని, సాంప్రదాయ ఓపెన్ సర్జరీ, ల్యాప్రోస్కోపిక్ సర్జరీలతో పోలిస్తే రోబోటిక్ సర్జరీ చాలా ప్రయోజనాలను కలిగి ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది మాత్రమే కాదు సాంప్రదాయ ఓపెన్ సర్జరీతో పోలిస్తే రికవరీ కూడా వేగంగా ఉంటుందట‌. కానీ రోబోటిక్ కిడ్నీ మార్పిడి సాంప్రదాయ ఓపెన్ సర్జరీ కంటే ఖరీదైనది అని చెబుతున్నారు.

Also Read: Hirsutism: స్త్రీల ముఖంపై గ‌డ్డం, మీసాలు క‌నిపించ‌డానికి గ‌ల కార‌ణాలివే..?

రోబోటిక్ కిడ్నీ మార్పిడిలో శస్త్రచికిత్స చేయడానికి రోబోటిక్ పరికరాలను ఉపయోగిస్తారు. ఇందులో సర్జన్లు రోగి కడుపులో అనేక చిన్న కోతలు చేసి రోబోటిక్ పరికరాలను చొప్పిస్తారు. ఈ పరికరాలు కెమెరాలతో కూడా అమర్చబడి ఉంటాయి. ఇవి శరీర శస్త్రచికిత్సలు చేయడంలో సర్జన్‌కు సహాయపడతాయి.

ప్రయోజనాలు ఏమిటి..?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోబోటిక్ కిడ్నీ మార్పిడికి ఓపెన్ సర్జరీ కంటే రోగి శరీరంలో చాలా చిన్న కట్ మాత్ర‌మే ఏర్పడుతుంది. స‌ర్జ‌రీ స‌మ‌యంలో నొప్పి, రక్తస్రావం ప్రమాదం తక్కువగా ఉంటుంది. కోలుకోవడం కూడా వేగంగా జరుగుతుంది. అంతేకాకుండా తక్కువ కోతలు మెరుగైన సౌందర్య ఫలితాలను అందిస్తాయని అంటున్నారు.

We’re now on WhatsApp : Click to Join