Israel Vs Iran : యుద్ధానికి సై.. ఇజ్రాయెల్‌ ఆర్మీ వర్సెస్ ఇరాన్‌ ఆర్మీ .. ఎవరి బలం ఎంత?

Israel Vs Iran :  సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌పై ఏప్రిల్ 1న ఇజ్రాయెల్ దాడిచేసింది.

  • Written By:
  • Publish Date - April 16, 2024 / 07:47 AM IST

Israel Vs Iran :  సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌పై ఏప్రిల్ 1న ఇజ్రాయెల్ దాడిచేసింది. దానికి ప్రతిగా ఇటీవల(శనివారం అర్ధరాత్రి) ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్లు, డ్రోన్లతో దాడికి పాల్పడింది. ఈ దాడికి సమాధానమిస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ చెబుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఒకవేళ మరోసారి తమపై కానీ, పశ్చిమాసియాలోని తమ సైనిక స్థావరాలపై కానీ ఇజ్రాయెల్ దాడి చేస్తే.. ఇప్పుడు చేసిన దాని కంటే రెట్టింపు రేంజులో ప్రతీకార దాడి ఉంటుందని ఇరాన్(Israel Vs Iran) స్పష్టం చేసింది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండటంపై ఐక్యరాజ్యసమితికి కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామాలు పశ్చిమాసియాను అగ్నిగుండంగా మారుస్తాయని, వీటిని వెంటనే చల్లార్చాల్సిన అవసరం ఉందని చెబుతోంది.ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల సైనికశక్తిని ఓ సారి చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

ఇరాన్ సైనికశక్తి వివరాలివీ.. 

  •  ఇరాన్‌కు రష్యా, చైనాల నుంచి బలమైన మద్దతు ఉంది. సైనికపరమైన టెక్నాలజీ కూడా ఈ దేశాల నుంచి ఇరాన్‌కు అందుతోంది.
  • సైనిక డ్రోన్లు, మిస్సైళ్ల తయారీలో ఇరాన్ చాలా డెవలప్ అయింది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు ఇటీవల కాలంలో చాలానే డ్రోన్లు, మిస్సైళ్లను ఇరాన్ సప్లై చేసింది.
  • ఇరాన్ వద్ద హైపర్‌సోనిక్‌ బాలిస్టిక్‌ క్షిపణి కూడా ఉంది. ఈ మిస్సైళ్లు ధ్వని కన్నా ఐదురెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి.
  • ప్రస్తుతం ఇరాన్ దగ్గర దాదాపు మూడు వేల మిస్సైళ్లు ఉన్నాయని అంటారు.
  • ఇటీవల ఇజ్రాయెల్‌పై జరిపిన దాడిలో చాలా ఏళ్ల కిందటి మిస్సైళ్లను, డ్రోన్లను ఇరాన్ వాడింది. వాటి ప్రయాణ వేగం చాలా తక్కువట. కొన్ని డ్రోన్లు ఇరాన్ నుంచి ఇజ్రాయెల్‌కు చేరుకోవడానికి 5 గంటల టైం పట్టిందంట. అందుకే ఇజ్రాయెల్‌లో ప్రాణనష్టం జరగలేదు.
  • కేవలం 12 నిమిషాల్లో ఇజ్రాయెల్‌కు చేరుకునేంత శక్తివంతమైన క్రూయిజ్ మిస్సైళ్లు కూడా ఇరాన్ వద్ద ఉన్నాయి.
  •  ఇరాన్‌ వద్ద ఉన్న కేహెచ్‌-55 క్రూయిజ్‌ మిస్సైల్‌కు అణు వార్‌హెడ్‌ను మోసుకెళ్లే సామర్థ్యం కూడా ఉంది. ఇది ఏకంగా 3 వేల కిలోమీటర్ల దూరం పయనించగలదు.
  • ఖలీద్‌ ఫర్జ్‌ అనే యాంటీ షిప్ మిస్సైల్ కూడా ఇరాన్‌ వద్ద ఉంది. ఇది 1000 కిలోల వార్‌హెడ్‌ను 300 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లగలదు.
  • ఇటీవల మొహాజిర్‌-10 అనే డ్రోన్‌ను ఇరాన్‌ డెవలప్ చేసింది. అది 2వేల కిలోమీటర్ల జర్నీ చేసి లక్ష్యాన్ని తుదముట్టించగలదు. 300 కిలోల ఆయుధాలతో ఇది కంటిన్యూగా దాదాపు  24 గంటల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టగలదు.
  • ఎస్‌-300 అనే గగనతల రక్షణ వ్యవస్థను ఇరాన్‌ వాడుతోంది. దేశీయంగా ఉత్పత్తి చేసిన బావర్‌-373 అస్త్రాలు, అర్మాన్‌, అజరక్ష్ వ్యవస్థలు కూడా అందుబాటులో ఉన్నాయి.
  • ఇరాన్‌ అణ్వాయుధాలను తయారు చేయడానికి ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.
  • జనాభా, విస్తీర్ణంపరంగా ఇజ్రాయెల్‌తో పోలిస్తే ఇరాన్‌ చాలా పెద్దది.
  • సంఖ్యపరంగా కూడా ఇరాన్‌ వద్ద ఉన్న ఆయుధ సంపత్తి ఎక్కువే.
  • ఇరాన్‌ సైన్యంలోని రివల్యూషనరీ గార్డ్స్‌ దళం, ఖుద్స్‌ ఫోర్స్‌లకు సైనిక మిషన్లలో మంచి అనుభవం ఉంది.
  • సైనిక శక్తి పరంగా వరల్డ్‌లో ఇరాన్ ర్యాంకు 14.

Also Read : Relationship Tips : ఈ అలవాట్లు మీ రిలేషన్‌షిప్‌ను పాడు చేస్తాయి.. ఈ తప్పులను నివారించండి..!

ఇజ్రాయెల్ సైనికశక్తి వివరాలివీ.. 

  • సైనిక శక్తిపరంగా వరల్డ్‌లో ఇజ్రాయెల్ ర్యాంకు 17.
  • ఇజ్రాయెల్‌కు ప్రధాన మిత్రదేశం అమెరికా. గాజాపై గత ఏడు నెలల దాడి కోసం ఇజ్రాయెల్‌కు ఆయుధాలను సప్లై చేసింది అమెరికానే.
  • ఇజ్రాయెల్ దాడులను కంటిన్యూ చేసేలా ఐక్యరాజ్యసమితిలో వీటో పవర్‌ను ప్రయోగించింది అమెరికానే.
  • ఇజ్రాయెల్ కోసం ఏది చేయడానికైనా అమెరికా సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే.. అరబ్ దేశాలు తమ అదుపులో ఉండాలంటే పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ బలంగా ఉండటం అతి ముఖ్యమని అమెరికా భావిస్తోంది.
  • శత్రుదేశాల క్షిపణులను గాల్లోనే పేల్చేయగల పేట్రియాట్‌, యారో, డేవిడ్‌ స్లింగ్‌, ఐరన్‌ డోమ్‌ వంటి గగనతల రక్షణ వ్యవస్థలు ఇజ్రాయెల్‌‌కు ఉన్నాయి.
  • స్వల్పశ్రేణి లోరా, డెలైలా, గాబ్రియేల్‌ క్షిపణులు కూడా ఇజ్రాయెల్  వద్ద ఉన్నాయి.
  • ఇజ్రాయెల్‌ వద్ద కూడా భారీగానే డ్రోన్లు ఉన్నప్పటికీ.. అవి నిఘా, సమాచార సేకరణకు ఉద్దేశించినవే. వీటిని పాలస్తీనాపై నిఘా కోసం ఇజ్రాయెల్ వాడుతుంటుంది.
  • ఇజ్రాయెల్‌ వద్ద  90 అణు బాంబులు ఉన్నట్లు అంచనా.
  • 800  కిలో టన్నుల నుంచి 12 మెగా టన్నుల సామర్థ్యం కలిగిన అణు, థర్మోన్యూక్లియర్‌ వార్‌హెడ్లను మోసుకెళ్లే ఖండాంతర క్షిపణులనూ ఇజ్రాయెల్  డెవలప్ చేస్తోంది.

Also Read : Blood Circulation : రక్త ప్రసరణను క్రమబద్ధీకరించడానికి ఈ 8 ఆహారాలను తినండి..!