IRCTC Room 100 : రైళ్ల ద్వారా నిత్యం లక్షలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, పుణ్యక్షేత్రాలు, ఇతర పనుల కోసం జర్నీ చేస్తుంటారు. అయితే రైళ్లు బాగా ఆలస్యం అయినప్పుడు రైల్వే స్టేషన్‌లోనే ఉండాల్సి వస్తుంటుంది. అలాంటప్పుడు బయట ఏదైనా హోటల్‌లో బస చేయాలంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది. అలాంటి వారి కోసమే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) రిటైరింగ్ రూమ్స్, డార్మిటరీ ఫెసిలిటీ కల్పిస్తోంది. వీటి తక్కువ ఖర్చుతోనే ప్రయాణికులు వాడుకోవచ్చు. ఏసీ, నాన్ ఏసీ, సింగిల్, డబుల్, డార్మిటరీ తరహాలో రూమ్స్ అందుబాటులో ఉంటాయి. కనీసం గంట నుంచి గరిష్టంగా 48 గంటల సమయం వరకు మనం గదిని బుక్ చేసుకోవచ్చు. ప్రాంతాన్ని బట్టి రూమ్ బుకింగ్ ఛార్జీలు ఉంటాయి. కనిష్టంగా రూ. 100.. గరిష్టంగా రూ. 700 వరకు రూం బుకింగ్ ఛార్జీ ఉంటుంది.
అయితే టికెట్ రిజర్వేషన్ ఓకే అయిన వ్యక్తులు మాత్రమే ఈ రూమ్స్‌ను బుక్ చేసుకోవచ్చు. వెయిట్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు ఈ వసతి ఉండదు. మన దేశంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇందుకోసం మీరు ఐఆర్సీటీసీ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి.అకౌంట్ సెక్షన్లోకి వెళ్లి మై బుకింగ్‌పై క్లిక్ చేయాలి. కిందికి స్క్రోల్ చేస్తే రిటైరింగ్ రూమ్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి.. మీ పీఎన్ఆర్ నంబర్, మీరు స్టే చేయాలని అనుకునే స్టేషన్ వివరాలను సమర్పించాలి. చెక్ ఇన్, చెక్ అవుట్ డేట్, బెడ్ టైప్ వంటి వివరాలను నింపాలి. స్లాట్ డ్యురేషన్, ఐడీ కార్డ్ టైప్ వంటి వివరాలు సరిగా చూసుకొని పేమెంట్ చేయాలి. ఏదైనా కారణంతో.. రూమ్ బుకింగ్‌ను రద్దు చేసుకుంటే మీ బుకింగ్ ఛార్జీ నుంచి 10 శాతం(IRCTC Room 100) మినహాయిస్తారు.