Site icon HashtagU Telugu

Artificial Rain : కృత్రిమ వర్షం ఎలా ? ఎంత ఖర్చవుతుంది ?

Artificial Rain

Artificial Rain

Artificial Rain : ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో అక్కడ కృత్రిమ వర్షం కురిపించాలనే చర్చ మొదలైంది. ఈవిషయాన్ని స్వయంగా ఢిల్లీ పర్యావరణ శాఖ ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం సహకరించి అన్ని అనుమతులను మంజూరు చేస్తే..  ఐఐటీ కాన్పూర్‌తో కలిసి కృత్రిమ వర్షం కురిపించే ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమని ఢిల్లీ సర్కారు అంటోంది. ఈనేపథ్యంలో అసలు  కృత్రిమ వర్షం అంటే ఏమిటి ? దాన్ని ఎలా కురిపిస్తారు ? అనేది తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

  • ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ వర్షాలపై ఆధారపడిన దేశాలు దాదాపు 40 దాకా ఉన్నాయి.  వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితుల వల్ల ఆయా దేశాలకు కృత్రిమ వర్షాలు తప్పనిసరిగా మారాయి.
  • భారత్‌లో కృత్రిమ వర్షాలను కురిపించే ప్రక్రియ 2003 సంవత్సరంలో ప్రారంభమైంది.
  • మనదేశంలోని  మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలోని చాలా ప్రాంతాలలోనూ కృత్రిమ వర్షాలను కురిపించిన ట్రాక్ రికార్డు ఉంది. కృత్రిమ వర్షాలను ‘క్లౌడ్ సీడింగ్’ అనే విధానం ద్వారా కురిపిస్తారు.
  • గాలిలో ఉన్న మేఘాల నుంచి వర్షాలను కురిపించే ప్రక్రియనే క్లౌడ్ సీడింగ్ అని పిలుస్తాం.
  • ఈ క్లౌడ్ సీడింగ్‌ ప్రక్రియలో అత్యాధునిక విమానం, భూమిపైనున్న రాడార్ వ్యవస్థ, ఓ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, కొందరు వాతావరణ శాస్త్రజ్ఞులు, పైలెట్లు, ఇతర నిపుణులు పాల్గొంటారు.  వర్షం కురిపించాల్సిన ఏరియాలో ఒక నిపుణుడు ఉండి.. అక్కడున్న వాతావరణ పరిస్థితుల గురించి విమానంలో ఉన్న శాస్త్రవేత్తలకు సమాచారాన్ని చేరవేయాల్సి ఉంటుంది. ఈ సమాచారం ఆధారంగానే ఆకాశంలో విహరించే శాస్త్రజ్ఞులు మేఘాల పరిస్థితులపై ఒక అంచనాకు వస్తారు.

కృత్రిమ వర్షాన్ని కురిపించే ప్రక్రియ ఇదీ..

కృత్రిమ వర్షాన్ని కురిపించే ప్రక్రియలో భాగంగా విమానాలు లేదా హెలికాప్టర్ల ద్వారా సిల్వర్ అయోడైడ్‌ లేదా పొటాషియం అయోడైడ్‌‌‌లను మేఘాలలోకి చిలకరిస్తారు. వీటి ప్రభావంతో మేఘాలలో నీటిబిందువులు ఏర్పడేందుకు అనుకూలమైన పరిస్థితులు క్రియేట్ అవుతాయి.  సిల్వర్ అయోడైడ్‌ లేదా పొటాషియం అయోడైడ్‌‌‌లను మేఘాలలోకి చిలకరించిన అరగంట తర్వాత.. వాటి ప్రభావం కనిపించడం మొదలవుతుంది. మేఘాలలో తేమ ఎక్కువగా ఉంటే ఈ ప్రయోగం సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  ఇలాంటి ప్రయోగాలలో సక్సెస్ రేటు దాదాపు 25 నుంచి 40శాతం దాకా ఉంటుంది. ఒక సిజన్‌లో మూడు నెలల కోసం కృత్రిమ వర్షాలు కురిపించే ఒక విమానాన్ని తెప్పించేందుకు, రాడార్‌ వ్యవస్థను వాడుకునేందుకు దాదాపు రూ. 10కోట్లకుపైనే ఖర్చవుతుంది. ప్రస్తుతం మనదేశంలో రెండు సంస్థలు మాత్రమే కృత్రిమ వర్షాలను కురిపిస్తున్నాయి. అవి.. సిరి ఏవియేషన్, అగ్ని ఏవియేషన్. కృత్రిమ వర్షాల వల్ల పర్యావరణంపై  కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ పడతాయి. దీనివల్ల  సముద్రాల్లో యాసిడ్ పెరుగుతుంది. ఓజోన్ పొర క్షీణిస్తుంది. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరుగుతుంది. అందుకే  దీర్ఘకాలం పాటు కృత్రిమ వర్షాలపై ఆధారపడటం అంత మంచిది(Artificial Rain) కాదు.