Google Pay Fee : ‘ఫోన్ పే’, ‘పేటీఎం’ బాటలోనే ‘గూగుల్ పే’ కూడా నడవడం మొదలుపెట్టింది. మొబైల్ రీఛార్జ్‌లపై ఇక ‘కన్వీనియన్స్ ఫీజు’ బాదుడును గూగుల్ పే కూడా ప్రారంభించిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మధ్య హాట్ డిబేట్ నడుస్తోంది. అయితే దీన్ని గూగుల్ పే ఇంకా ధ్రువీకరించలేదు. యూపీఐ ద్వారా మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే రూ. 3 చొప్పున కన్వీనియన్స్ ఛార్జీని గూగుల్ వసూలు చేస్తోందనే చర్చ జరుగుతోంది.
We’re now on WhatsApp. Click to Join.
‘‘నేను గూగుల్ పే యాప్ ద్వారా రూ. 749 జియో ప్రీపెయిడ్ రీచార్జ్ చేసుకున్నాను. దానిపై రూ.3 కన్వీనియన్స్ ఫీజు విధించారు’’ అంటూ ముకుల్ శర్మ అనే వ్యక్తి ట్విట్టర్లో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. రూ. 100లోపు గూగుల్ పే ద్వారా మొబైల్ రీఛార్జ్ చేసేవారి నుంచి ఎలాంటి కన్వీనియన్స్ ఫీజు వసూలు చేయడం లేదని ముకుల్ శర్మ పేర్కొన్నారు. ‘‘రూ. 100 నుంచి రూ.200 వరకు మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే కన్వీనియన్స్ ఛార్జ్ రూ.2 దాకా ఉంది. రూ. 200 నుంచి రూ.300 వరకు మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే కన్వీనియన్స్ ఛార్జ్ రూ.3 దాకా ఉంది. రూ.300 కంటే ఎక్కువగా ఉండే మొబైల్ రీఛార్జులకు కూడా కన్వీనియన్స్ ఛార్జ్ రూ. 3 ఉంది’’ అని ముకుల్ శర్మ తన పోస్టులో వివరించారు. గూగుల్ పేలో యూపీఐ ద్వారా మొబైల్ రీఛార్జ్‌పై కన్వీనియన్స్ ఫీజుకు సంబంధించి నవంబర్ 10న అప్డేట్ వచ్చినట్టు(Google Pay Fee) తెలుస్తోంది.