Site icon HashtagU Telugu

Google – WhatsApp : ‘బ్యాకప్‌’పై వాట్సాప్, గూగుల్ డ్రైవ్‌ కీలక నిర్ణయం

Google Whatsapp

Google Whatsapp

Google – WhatsApp : ‘బ్యాకప్’ విషయంలో వాట్సాప్, గూగుల్ కలిసికట్టుగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఛాట్ బ్యాకప్ కోసం అన్‌ లిమిటెడ్ స్టోరేజ్ కోటాకు త్వరలోనే ఆ రెండు కంపెనీలు మూకుమ్మడిగా పుల్‌స్టాప్ పెట్టబోతున్నాయి. ఇప్పటివరకు వాట్సాప్ బ్యాకప్‌ను గూగుల్ స్టోరేజ్‌ లెక్కలోకి తీసుకునేది కాదు. ఇకపై వాట్సాప్ బ్యాకప్ కూడా గూగుల్ లెక్కలోకే వస్తుంది. దీంతో ప్రస్తుతం అన్ లిమిటెడ్‌గా ఉన్న వాట్సాప్‌ బ్యాకప్.. త్వరలో 15 జీబీకి పరిమితం అవుతుంది. వాట్సాప్ యూజర్‌కు గూగుల్ అకౌంట్లో ఎంత స్పేస్ ఖాళీగా ఉందో.. అంతే డేటాను బ్యాకప్ చేసుకోగలరు. అంతకంటే ఎక్కువ స్పేస్ కావాలంటే.. గూగుల్ వన్ నుంచి కొనుక్కోవాలి. గూగుల్ వన్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ రేటు నెలకు రూ.149 నుంచి ప్రారంభం అవుతుంది. దీని ద్వారా 100 జీబీ స్పేస్ లభిస్తుంది. 200 జీబీ స్టాండర్డ్ ప్లాన్‌ కోసం నెలకు రూ.210 చెల్లించాలి. 2 టీబీ ప్రీమియం ప్లాన్ సబ్‌స్క్రిప్షన్‌ రేటు రూ.650. ఒకవేళ ఈ ప్లాన్స్‌ను కొనడం ఇష్టం లేకుంటే  మీ గూగుల్ ఖాతాలోని పనికిరాని ఫైల్స్‌ను డిలీట్ చేయాల్సి ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

వాట్సాప్ చాట్ హిస్టరీ బ్యాకప్ ఎలా? 

  • మీ వాట్సాప్ చాట్ హిస్టరీని బ్యాకప్ చేయడానికి యాప్‌‌లోని సెట్టింగ్స్ సెక్షన్‌లోకి వెళ్లండి.
  • అందులో ‘చాట్స్’ ఆప్షన్‌ను ఎంచుకొని.. ఆపై ‘చాట్ బ్యాకప్’‌ను ఎంచుకోండి.
  • యూజర్ గూగుల్ అకౌంట్లలో తగినంత స్టోరేజీ ఉన్నంత వరకు ఆండ్రాయిడ్ బ్యాకప్‌లు పనిచేస్తూనే ఉంటాయి.
  • యూజర్ స్టోరేజీ లిమిట్‌కు చేరుకున్నట్లయితే.. బ్యాకప్‌లను ఖాళీ చేసుకోవాలి. ఎంత ఖాళీ చేసుకుంటే.. అంత కొత్త స్పేస్ వస్తుంది.
  • గూగుల్ డిస్క్, జీమెయిల్, గూగుల్ ఫొటోలతో సహా వివిధ ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయగల 15జీబీ కాంప్లిమెంటరీ క్లౌడ్ స్టోరేజీని గూగుల్(Google – WhatsApp) అందిస్తుంది.

 Also Read: Day 6 – Tunnel Drilling : 40 మంది కార్మికులు ఆరో రోజూ టన్నెల్‌ లోపలే.. ఏమవుతోంది ?