Site icon HashtagU Telugu

Musk – Robo : ఈ రోబో గుడ్లు ఉడకబెడుతుంది.. డ్యాన్స్, జిమ్ చేస్తుంది

Musk Robo

Musk Robo

Musk – Robo : ట్విట్టర్ (ఎక్స్) యజమాని ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ రోబోల తయారీలో దూసుకుపోతోంది. ఈ ఏడాది మార్చిలో Optimus Gen 1 అనే రోబోను టెస్లా కంపెనీ విడుదల చేసింది. తాజాగా Optimus Gen 2 రోబోను టెస్లా రిలీజ్ చేసింది. దీని స్పెషాలిటీలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ రోబో మనుషుల కోసం గుడ్లను ఉడకబెట్టి ఇవ్వగలదు. ఈ రోబో పనితీరును తెలిపే ఒక వీడియోను ఎలాన్ మస్క్ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. బౌల్‌లోని కోడిగుడ్లలో ఒకదాన్ని రోబో తన చేతి రెండు వేళ్లతో తీసుకొని  గిన్నెలో వేసి ఉడకబెట్టడాన్ని మనం ఈ వీడియోలో మనం చూడొచ్చు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ రోబో చేతి మడమ, వేళ్ల కదలికలు చాలా సులువుగా, సాఫీగా జరగడం వీడియోలో కనిపిస్తుంది. ఫలితంగా వస్తువులను సురక్షితంగా పట్టుకునే గ్రిప్ అనేది Optimus Gen 2 రోబోలకు లభించింది. భవిష్యత్తులో రెస్టారెంట్లు, హోటళ్లలో రోబోల వాడకానికి సంకేతం ఇచ్చేలా  Optimus Gen 2 రోబో పనిచేస్తుండటం విశేషం. అంతేకాదు.. Optimus Gen 2 రోబో వ్యాయామం కూడా చేస్తోంది. వ్యాయామానికి సంబంధించిన వివిధ భంగిమలను ది ప్రదర్శించడాన్ని  సైతం మనం వీడియోలో చూడొచ్చు. అచ్చం మనిషిలా డ్యాన్స్ చేసే సామర్థ్యం ఈ రోబోకు ఉందని సైంటిస్టులు అంటున్నారు.

Also Read: WhatsApp Pin Chat : వాట్సాప్ ఛాట్‌లను ఇలా ‘పిన్’ చేసేయండి

టెస్లా కంపెనీ రూపొందించిన మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోట్ పేరు ‘ఆప్టిమస్’. దీన్ని ‘బంబుల్సీ’ అని కూడా పిలుస్తారు. 2018లో రిలీజైన్ ఫిక్షన్ సినిమా బంబుల్‌బీ (Bumblebee)లోని రోబో క్యారెక్టర్ పేరును దానికి పెట్టారు.  ‘బంబుల్సీ’ రోబోను 2021 సెప్టెంబరులో ఆవిష్కరించారు. బంబుల్‌బీతో పోలిస్తే ఇప్పుడు తీసుకొచ్చిన Optimus Gen 2 రోబో చాలా అడ్వాన్స్‌డ్.  Optimus Gen 1 రోబోతో పోలిస్తే Optimus Gen 2 రోబోలో మెరుగైన బ్యాలెన్స్ ఉంటుంది. దీనికి శరీరంపై పూర్తి నియంత్రణ ఉంటుంది. చలాకీగా నడవగలదు. AI టెక్నాలజీని వాడుకొని ఇది పనిచేయగలదు. అవసరమైతే నడక వేగాన్ని పెంచగలదు. Optimus Gen 1 రోబోతో పోలిస్తే Optimus Gen 2 రోబో(Musk – Robo) బరువును 10 కిలోలు తగ్గించారు. నడకలో వేగాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.