Banks New Rules : బ్యాంకింగ్ రంగంలో రూల్స్ వేగంగా మారిపోతుంటాయి. కొత్త నెల వచ్చిందంటే చాలు.. కొత్త రూల్స్ అమల్లోకి వచ్చేస్తుంటాయి. బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల నిబంధనల్లో సంస్థాగత అవసరాల మేరకు, వినియోగదారుల ప్రయోజనాల కోసం కొన్ని నిబంధనలను మార్చేస్తుంటారు. వీటివల్ల సామాన్య ఖాతాదారులపైనా చాలా ప్రభావం ఉంటుంది. ఈనేపథ్యంలో వచ్చే నెలలో (మే 2024) మారనున్న కొన్ని బ్యాంకింగ్ రూల్స్(Banks New Rules) గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
ఐసీఐసీఐ బ్యాంకు
ఐసీఐసీఐ బ్యాంకు కూడా సేవింగ్స్ అకౌంట్ రూల్స్‌ను మార్చేసింది. మే 1 నుంచి ఈ రూల్స్ అమల్లోకి వస్తాయి. డెబిట్ కార్డుపై ప్రతి సంవత్సరం వసూలు చేసే ఫీజును రూ.200కి తగ్గించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఛార్జీ అత్యల్పంగా రూ.99 ఉంటుంది. మే 1 నుంచి 25 పేజీలు కలిగిన చెక్ బుక్‌లపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. దీని తర్వాత ప్రతి పేజీకి రూ.4 చొప్పున కస్టమర్ చెల్లించాలి. వినియోగదారులు ఐఎంపీఎస్ లావాదేవీలు చేస్తే ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదు. ఒక్కో లావాదేవీకి రూ.2.50 నుంచి రూ.15 వరకు ఛార్జీని తీసుకుంటారు.
యస్ బ్యాంకు
యస్ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్స్‌కు సంబంధించిన మినిమం బ్యాలెన్స్ రూల్‌ను మార్చేసింది. మార్చేసిన రూల్ మే 1 నుంచి అమల్లోకి రానుంది. యస్ బ్యాంక్ ప్రో మాక్స్ సేవింగ్స్ ఖాతాల కనీస సగటు బ్యాలెన్స్ విలువను రూ.50,000కి మార్చారు. ఒకవేళ అకౌంటులో ఈ బ్యాలెన్స్ లేకుంటే రూ.1000 గరిష్ట ఛార్జీని విధిస్తారు. “ప్రో ప్లస్”, “యస్ రెస్పెక్ట్ SA” “Yes Essence SA” రకం అకౌంట్ల కనీస సగటు బ్యాలెన్స్ పరిమితి రూ. 25,000. ఇది మెయింటైన్ చేయలేనిి వారికి రూ. 750 ఛార్జీ విధిస్తారు. ఇక యస్ బ్యాంకు ప్రో అకౌంటులో మినిమం బ్యాలెన్స్ రూ. 10,000 ఉండాలి. అది లేకుంటే రూ. 750 ఛార్జీ విధిస్తారు.
Also Read : Houthis Attack : భారత్‌కు వస్తున్న నౌకపై హౌతీల ఎటాక్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టడానికి లాస్ట్ డేట్ మే 10. ఇందులో ఇన్వెస్ట్ చేసే వారికి పెట్టుబడిపై 0.75 శాతం అదనపు వడ్డీ లభిస్తుంది. అయితే ఈ ఫిక్సడ్ డిపాజిట్ అనేది సాధారణ ఎఫ్‌డీకి భిన్నంగా ఉంటుంది. దీనిలో 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఎఫ్‌డీలపై 7.75 శాతం మే వడ్డీ లభిస్తుంది. ఈ స్కీంలో సీనియర్ సిటిజన్లు రూ. 5 కోట్ల దాకా డిపాజిట్ చేయొచ్చు.