Site icon HashtagU Telugu

Dakshinavarti Shankh : దీపావళి రోజున ఆ శంఖానికి పూజలు.. ఎందుకు ?

Dakshinavarti Shankh

Dakshinavarti Shankh

Dakshinavarti Shankh : లక్ష్మీదేవి.. ఆనందం, శ్రేయస్సు , సంపదకు అధిదేవత. అందుకే దీపావళి రోజున లక్ష్మీదేవి కరుణా కటాక్షాల కోసం పూజలు చేస్తుంటారు. వినాయకుడిని కూడా పూజిస్తారు. ఈ పూజలను నిర్వహించే  సమయంలో దక్షిణావర్తి శంఖాన్ని తీసుకొచ్చి పూజలో ఉంచుతారు. ఈ శంఖం ప్రత్యేకత ఏమిటంటే.. పాల సముద్రాన్ని దేవతలు, రాక్షసులు కలిసి చిలుకుతున్న సమయంలో శ్రీ మహాలక్ష్మితో పాటు దక్షిణావర్తి శంఖం ఉద్భవించింది. అందుకే లక్ష్మీదేవితో పాటు ఈ శంఖాన్ని కూడా పూజిస్తుంటారు.  ఈ శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆహార ధాన్యాల కొరత ఉండదని నమ్ముతారు.

We’re now on WhatsApp. Click to Join.

మిగతా శంఖాలకు దక్షిణావర్తి శంఖానికి ప్రధాన తేడా ఏమిటంటే.. దక్షిణావర్తి శంఖం ముఖం కుడి వైపున ఉంటుంది. అయితే దీన్ని ఇంట్లో ఉంచుకోవడానికి ముందు..  గంగా జలంతో నింపాలి. ఒక రోజు పూర్తయ్యే వరకు ‘ఓం శ్రీ లక్ష్మీ బేతాయై నమః’ అనే మంత్రాన్ని జపించాలి. మంత్రం చదివిన తర్వాత దక్షిణవర్తి శంఖాన్ని ఎర్రటి గుడ్డలో చుట్టాలి.  దీన్ని ఇంటిలోని నైరుతి దిశలో ఉంచడం వల్ల ఎప్పుడూ డబ్బుకు లోటుండదని చెబుతారు. దక్షిణావర్తి శంఖాన్ని దక్షిణం వైపు ఉంచితే ప్రతికూల శక్తులు ఇంట్లో ఉండవు. శత్రువులు మీకు హాని చేయలేరు. దీన్ని ప్రతి శుక్రవారం పూజిస్తే ఇంట్లో ధనధాన్యాలకు కొదువ ఉండదని విశ్వసిస్తారు. ఈ శంఖంతో శబ్దం చేయడం వల్ల ఇంటిలోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందని(Dakshinavarti Shankh) అంటారు.

Also Read: India vs New Zealand: భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్.. కివీస్ పై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా..?

గమనిక: ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాన్ని వినియోగదారులు కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.